మళ్లీ ‘అంతే’

ABN , First Publish Date - 2022-08-12T07:17:50+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్నాయి. ఎక్కడికక్కడ వందలాది మంది పాజిటివ్‌ బారిన పడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలే కనిపిస్తుండడంతో గుట్టుచప్పుడు కాకుండా మందులు కొని వాడేస్తున్నారు.

మళ్లీ ‘అంతే’

  • -జిల్లాలో చాపకిందనీరులా విజృంభిస్తున్న కొవిడ్‌ 
  • -రోజువారీ అధికారిక కేసులు ఇరవైలోపే: అనధికారికంగా వందల్లోనే
  • -ఎక్కడికక్కడ మందులు కొని వాడేస్తున్న బాధితులు: ఆనక యథేచ్చగా జనంలోకి
  • -ఫీవర్‌ సర్వేలో 46వేల మందికిపైగా టెస్ట్‌లు: ఫలితాలు గోప్యం
  • -మరోపక్క కేసులు పెరుగుతున్నా కొవిడ్‌ టెస్ట్‌లు పెంచడంలో ప్రభుత్వం అశ్రద్ధ
  • -రోజుకు జిల్లావ్యాప్తంగా 700 మందికే ఆర్‌టీపీసీఆర్‌: ఇందులో 200 కాకినాడలోనే

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసులు విజృంభిస్తున్నాయి. ఎక్కడికక్కడ వందలాది మంది పాజిటివ్‌ బారిన పడుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలే కనిపిస్తుండడంతో గుట్టుచప్పుడు కాకుండా మందులు కొని వాడేస్తున్నారు. యథేచ్ఛగా జనంలోకి తిరిగేస్తున్నారు. కాకినాడ నగరంతోపాటు అనేక పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడ చూసినా వందలాదిమంది పాజిటివ్‌తో సతమతమవుతున్నారు. కానీ ప్రభుత్వం కొవిడ్‌ లెక్కలు బయటకు చెప్పడం లేదు. బయట వందల్లో కేసులుంటే అధికారికంగా 20 లోపేనంటూ తగ్గించి చెబుతోంది. అటు కాకినాడలో 200, మిగిలిన జిల్లాలో రోజుకు 500మందికి మాత్రమే ఆర్‌టీపీసీఆర్‌ చేస్తున్నారు. ఈ శాంపిళ్లు తరలించడానికి వాహనాలు లేక రోజుల తరబడి వాటిని ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు.

ఆ..ఏమవుతుందిలే...

కొవిడ్‌ కేసులు రెండునెలలుగా జిల్లాలో అంతకంతకూ పెరిగిపోతున్నా యి. ఒకటీ అరా కేసుల స్థానంలో పదుల సంఖ్యలో పాజిటివ్‌లు పుట్టుకొ స్తున్నాయి. దీంతో గతేడాది జులైనాటి అనుభవనాలు భయపెడుతున్నా యి. అప్పట్లో రోజుకు 2వేలమందికిపైగా జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ బారిన పడ్డారు. ఆ విషాదం తర్వాత గతేడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది మే వరకు ఎక్కడా పెద్దగా పాజిటివ్‌లు కనిపించ లేదు. అనూహ్యంగా జూన్‌ నుంచి మళ్లీ జిల్లాలో వైరస్‌ క్రమేపీ విజృంభిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో బాధితు లు వైరస్‌ బారినప డుతున్నారు. జ్వరం, దగ్గు, తలనొప్పి, గొంతునొప్పి ఉండ డంతో టెస్ట్‌ ఫలితా లు వచ్చేలోపు మం దుల కిట్‌ కొని వాడేస్తున్నారు. దీంతో వారం వ్యవధి లోనే సాధారణ స్థితికి వస్తున్నారు. బాధితులు పెరుగుతున్నా ప్రభుత్వం కేసులను పట్టిం చుకోవడం లేదు. తీవ్రత తక్కువగా చూపేందుకు రోజు వారీ కేసులు పది నుంచి ఇరవై లోపే చూపిస్తున్నారు. నెలకు అధి కారికంగా పాజి టివ్‌లు 500వరకు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. కానీ ఇవి వేలల్లో ఉంటున్నాయి. క్షేత్రస్థారు కేసులేవీ అధికారిక లెక్కలకు ఎక్కడం లేదు. కేసులు పెరుగుతున్నా టెస్ట్‌ల విషయంలోను ప్రభుత్వం అశ్రద్ధగా ఉం టోంది. కాకినాడ నగరంలో 200, మిగిలిన జిల్లా అంతా కలిపి 500 మందికి రోజూ ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేస్తోంది. 7.31లక్షల ఆవాసాలున్న జిల్లాలో టెస్ట్‌లు విస్తృతంగా చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇదంతా ఒకెత్తయితే కొవిడ్‌ కేసులు గుర్తించడానికి గత సోమ వారం నుంచి జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ ఫీవర్‌ సర్వే ప్రారంభించింది. ఇప్పటి వరకు 46వేల శాంపిళ్లు సేకరించారు. కానీ ఎంతమందికి జ్వరాలు న్నాయనేది బయటపెట్టడం లేదు.

శాంపిళ్లు పాడైపోతున్నాయంటే..

కాకినాడ మినహా మిగిలిన జిల్లాలో చేస్తున్న కొవిడ్‌ టెస్ట్‌లకు సంబం ధించి శాంపిళ్లు రోజుల తరబడి అక్కడే వదిలేస్తున్నారు. ఈ శాంపిళ్లను కాకినాడ జీజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు తరలించడానికి వాహనాలు కావాలి. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో సేకరిస్తున్న ఆర్‌టీపీసీఆర్‌ శాంపిళ్లు అక్కడే ఉండిపోతున్నాయి. వీటిని స్థానికంగా ఐఎల్‌ఆర్‌ ఫ్రిజ్‌ల్లో నిల్వ చేయాలి. కానీ స్థానికంగా సిబ్బంది పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ కాకినాడకు తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఎప్పుడో వారం తర్వాత శాంపిళ్లు కాకినాడ చేరేలోపు పాడైపోతున్నాయి. ఇలా కొన్నివందలు వృథా అయిపోతున్నాయి. మరోపక్క శాంపిల్‌ ఫలితా లు వారాల తరబడి రాక బాధితులు బెంబేలెత్తుతున్నారు. దీనివల్ల కాం టాక్ట్‌ కేసులు పెరుగుతున్నాయి. వాస్తవానికి గతేడాది కూడా ఇలాగే జిల్లాలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో తీసిన శాంపిళ్లు తరలించడానికి అధికారులు నాలుగు వాహనాలు ఏర్పాటు చేశారు. తీరా బిల్లులు ఇవ్వక పోవడంతో నిర్వాహకులు మధ్యలో వెళ్లిపోయారు. ఇప్పుడైతే అసలు వాహనాలే లేవు. దీంతో శాంపిళ్లు వృథాగా పోతున్నాయి. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న శాంపిళ్లు కాకినా డకు తరలించడానికి వాహనాలు కావాలని అధికారులు ఇటీవల ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిని నాన్చినాన్చి ఎట్టకేలకు ఒక్క వాహనానికే అనుమతి ఇచ్చింది. జిల్లా అంతా తిరిగి శాంపిళ్లు తేవడానికి ఇదొక్కటి అసలేం చాలదు. కానీ ప్రభుత్వం ఒక్క వాహనానికే అనుమతి ఇవ్వడంతో ఆగస్టు 15నుంచి దీన్ని వైద్యఆరోగ్యశాఖ ప్రారంభించనుంది. దీంతో ఒక్కో రోజు ఒక్కో రూట్‌లో దీన్ని తిప్పనున్నారు. ఈ వాహనం వచ్చే దారిలోని పీహెచ్‌సీలు రోజుకు పదిమందికి మాత్రమే టెస్ట్‌లు చేయాలని అధికారులు నిబంధనలు విధించారు.

Updated Date - 2022-08-12T07:17:50+05:30 IST