కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలి

ABN , First Publish Date - 2021-04-15T05:30:00+05:30 IST

కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ ఆనందరెడ్డి అన్నారు.

కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలి
జంగారెడ్డిగూడెంలో వాహనదారులను తనిఖీ చేస్తున్న ఎస్‌ఐ

జంగారెడ్డిగూడెం, ఏప్రిల్‌ 15: కరోనా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం ఎస్‌ఐ ఆనందరెడ్డి అన్నారు. పట్టణంలో శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహించి మాస్కు లేని వారికి జరిమానా విధించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం వేలాది మం ది పనుల నిమిత్తం పట్టణం వస్తున్నారన్నారు. వారంతా కరోనాపై అప్ర మత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మాస్కులు ధరించి, శానిటైజర్‌లను వాడుకోవాలన్నారు. మాస్కులు లేకుండా వాహనాలు నడిపే వారిని గుర్తించి పలువురికి జరిమానా విధించారు.


కొయ్యలగూడెం: మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తే జరిమానా విధిస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ తెలిపారు. కన్నాపురం రోడ్డులో వాహన చోదకులకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతీ రోజు కొవిడ్‌పై ప్రజలకు అవగాహాన కల్పించడానికి సిబ్బందిని ఏర్పాటు చేశామ న్నారు. మైకుల ద్వారా అవగాహాన కల్పిస్తున్నామని తెలిపారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకుంటే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.

Updated Date - 2021-04-15T05:30:00+05:30 IST