రెండు జిల్లాల్లో వేగంగా పెరుగుతున్న Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-13T17:53:24+05:30 IST

ఈ ఏడాది ప్రారంభంలోనే బళ్లారి, విజయనగర జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతుండగా, అధికారులు అప్రమతమవుతున్నారు. ఉభయ జిల్లాల్లో వేగంగా విస్తరించడంతోపాటు థర్డ్‌వేవ్‌ ఎక్కువగా పిల్లలపై

రెండు జిల్లాల్లో వేగంగా పెరుగుతున్న Covid కేసులు

బళ్లారి(కర్ణాటక): ఈ ఏడాది ప్రారంభంలోనే బళ్లారి, విజయనగర జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతుండగా, అధికారులు అప్రమతమవుతున్నారు. ఉభయ జిల్లాల్లో వేగంగా విస్తరించడంతోపాటు థర్డ్‌వేవ్‌ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచించిన నేపథ్యంలో రెండు జిల్లాల అధికారులు కొవిడ్‌ బాధితుల కోసం అవసరమైన ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు సిద్ధం చేస్తున్నారు. పిల్లల వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేసే దిశలో యంత్రాంగం సిద్ధమవుతోంది. బుధవారం సాయంత్రానికి బళ్లారి, విజయనగర ఉభయ జిల్లాల్లో ఒకే రోజు 180 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బళ్లారి జిల్లాలో 530 యాక్టివ్‌ కేసులు ఉండగా, బుధవారం కొవిడ్‌ కారణంగా ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 

Updated Date - 2022-01-13T17:53:24+05:30 IST