పాజిటివిటీ 10 %

ABN , First Publish Date - 2022-01-20T06:23:10+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఒక్క సారిగా పది శాతానికి పెరిగింది. సంక్రాంతి తరువాత నమోదవు తున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు నిర్ధా రణ అయ్యింది.

పాజిటివిటీ 10 %

పెరుగుతున్న కేసుల ఉధృతి.. 216 మందికి కరోనా

మరో 11 మంది టీచర్లకు పాజిటివ్‌

ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 19 : జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఒక్క సారిగా పది శాతానికి పెరిగింది. సంక్రాంతి తరువాత నమోదవు తున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నట్టు నిర్ధా రణ అయ్యింది. గత వారం వరకు 1–2 శాతంగా ఉన్న పాజిటివిటి రేటు మంగళ, బుధవారాల్లో అమాంతం పది శాతానికి పెరగడంపై ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే బాధితుల సంఖ్య కొన్ని రెట్లు పెరుగుతుందని అంచనాకు వచ్చారు. వాస్తవానికి కొవిడ్‌ నిర్ధారించుకునేందుకు చాలా మంది మందుల షాపుల్లో విక్రయిం చే సెల్ఫ్‌ టెస్ట్‌ కిట్‌లను వాడుతూ హోం ఐసోలేషన్‌లో ఉండిపోతుండ డంతో బాధితులను పూర్తిస్థాయిలో గుర్తించే అవకాశం లేకుండా పో యిందని వైద్యవర్గాలే చెబుతున్నాయి. జిల్లాలో మంగళ, బుధవారాల్లో నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 70 శాతానికి పైగా బాధితులు ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం తదితర పట్టణ ప్రాంతాలకు చెందిన వారే ఉన్నట్టు వైద్యాధికారులు వివరించారు. కాగా బుధవారం జిల్లాలో 216 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, కొత్తగా తొమ్మిది చోట్ల కంటైన్మెంట్‌ జోన్‌లు వెలిశాయి. మరోవైపు కొవిడ్‌ బయటపడినా జ్వరం, దగ్గు లేకపోవడంతో చాలా మంది రోడ్లపైనే తిరిగేస్తున్నారు. దీనివల్ల వైరస్‌ మరింత విజృంభిస్తోంది.  


మరో 11 మంది టీచర్లకు కొవిడ్‌

ఉపాధ్యాయులపై కొవిడ్‌ పంజా విసురుతోంది. బుధవారం వెల్లడైన పరీక్షల ఫలితాల్లో మరో 10 మంది ఉపాధ్యాయులు, ఒక ఉపాధ్యాయేతర సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో గత మూడు రోజులుగా కొవిడ్‌ వచ్చిన వారి సంఖ్య టీచర్లు 20 మంది, బోధ నేతర సిబ్బంది రెండుకు చేరింది. కలవచర్ల, దేవులపల్లి మెయిన్‌, ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల, మైసన్నగూడెం, చిన్నంవారిగూడెం, మారంపల్లి, జగన్నాధపురం, చెరకువాడ, దర్శిపర్రు, భోగాపురం, గొల్లలకోడేరు మెయిన్‌ పాఠశాలల్లో మొత్తం పది మంది టీచర్లు, ఒక రికార్డు అసిస్టెంట్‌కు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. 


ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సిద్ధం

ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, పాలకొల్లులలోని ప్రభుత్వాసుపత్రులతో పాటు, కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలందించేందుకు ప్రైవేటు రంగంలో మరో పది ఆరోగ్యశ్రీ ఆసుపత్రులను తాజాగా నోటిఫై చేశారు. ఏలూరులోని చైత్ర హాస్పటల్‌, మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌, జంగారెడ్డిగూడెం శ్రీ సూర్య నర్సింగ్‌ హోం, జానకీ నర్సింగ్‌ హోం, తణుకు యాపిల్‌ హాస్పటల్‌, జాబిల్లి హాస్పటల్‌, విజయ హాస్పటల్‌, భీమవరం హాస్పటల్‌, తాడేపల్లిగూడెంలో వైష్ణవి హాస్పటల్‌, పాలకొల్లులో సుఖీభవ నర్సింగ్‌ హోంలను కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించారు. వీటన్నింటిలో ఐసీయూ బెడ్స్‌ 163, ఆక్సిజన్‌ జనరల్‌ బెడ్స్‌ 346, జనరల్‌ బెడ్స్‌ 231 పడకలను కొవిడ్‌ వైద్య సేవల కోసం ప్రత్యేకించారు.


కొందరికే కొవిడ్‌ టెస్టులు

ఆకివీడు/తణుకు, జనవరి 19 : రోజురోజుకు కొవిడ్‌ కేసులు ప్రబలుతున్నందున పరీక్షల కోసం ఆసుపత్రు లకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే వచ్చి న వారందరికీ పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది కొందరికే చేస్తున్నారు. మిగిలిన వారు ప్రైవేటు ల్యాబ్‌లను, ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంలో అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ప్రతీ ఒక్కరికి టెస్ట్‌లు చేసేవారు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చిన వారికి, లక్షణాలు ఉన్న వారికి మాత్రమే వీఆర్‌డీఎల్‌ పరీక్షలు చేస్తున్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు వంద టెస్టులు మాత్రమే చేయాలని నిబంధన విధించడంతో చాలా మంది ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆకివీడు లో రెండుచోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కోచోట పది మందికే చేసే అవకాశం ఉండడంతో మిగిలిన వారికి చేయడం లేదు. రోజుకు పది మాత్రమే పరీక్షలు చేస్తున్నట్టు యూపీహెచ్‌సీ వైద్యుడు పవన్‌కుమార్‌ తెలిపారు. 


Updated Date - 2022-01-20T06:23:10+05:30 IST