పల్లెల్లో కరోనా పాగా

ABN , First Publish Date - 2021-08-04T05:34:44+05:30 IST

గ్రామాల్లో కరోనా నియంత్రణలోకి రానంటోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది.

పల్లెల్లో కరోనా పాగా
శనివారపుపేటలో పారిశుధ్య పనులు

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు 

ఆందోళనలో ప్రజలు 

ఏలూరు రూరల్‌, ఆగస్టు 3 : గ్రామాల్లో కరోనా నియంత్రణలోకి రానంటోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అన్ని వర్గాల్లోనూ ఆందోళన నెలకొంది. మంగళవారం మండలంలో ఆరు కేసులు నమోదయ్యాయి. తగ్గినట్టే తగ్గి కేసులు మళ్లీ పెరుగుతుండడంతో అధికారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూలై మొదటి వారం నుంచి ఇప్పటి వరకు 70 కేసులు పైగా నమోదు అయ్యాయి. కర్ప్యూ సడలింపుల కారణంగా కొవిడ్‌ నిబంధనలు గాలికి ఒదిలేసి ప్రజలు రోడ్లపైకి రావడంతో కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మండలంలో ఆందోళన కల్గించే స్థాయిలో వైరస్‌ మరోసారి పాగా వేస్తోంది. 

గ్రామాల్లో ప్రచారం అవసరం.. 

కరోనా ప్రభావం తీవ్రమవుతున్న దశలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తగి న అవగాహనతోపాటు హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామా ల్లో ఎక్కువగా కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. వైద్య ఆరోగ్యశాఖ తమ ప్రాథమిక కేంద్రాల పరిధిలో కరోనా నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకో వాల్సి ఉంది. ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలతో  ప్రచారం నిర్వహించడం తో పాటు పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అప్పుడే కరోనా నియంత్రించే అవకాశం ఉంటుంది. ఎక్కువ పాజిటివ్‌ వచ్చిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌, ప్రత్యేక శానిటేషన్‌ చేశారు. గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేశారు. మండలంలో మంగళవారం 560 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశామని మండల వైద్యాధికారి డాక్టర్‌ దేవ్‌ మనోహర్‌ కిరణ్‌ తెలిపారు. 

పెదపాడులో మూడు పాజిటివ్‌ కేసులు 

పెదపాడు, ఆగస్టు 3:వట్లూరు పీహెచ్‌సీ పరిధి అప్పనవీడులో ఒకటి, వ ట్లూరులో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని వైద్య అధికారులు తెలిపారు. 

పెదవేగిలో తొమ్మిది పాజిటివ్‌ కేసులు..

పెదవేగి, ఆగస్టు 3 : మండలంలో మంగళవారం తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని పెదవేగి పీహెచ్‌సీ వైద్యాధికారి టీవీఎల్‌.ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఇప్పటివరకు మండలంలో 1595 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో హోమ్‌ ఐసొలేషన్‌లో 1376 మంది ఉంటూ చికిత్స పూర్తిచేసుకున్నారని వైద్యాధికారి తెలిపారు. 

Updated Date - 2021-08-04T05:34:44+05:30 IST