కరోనా కోరల్లో రంప ఐటీడీఏ

ABN , First Publish Date - 2021-05-12T05:19:30+05:30 IST

రంపచోడవరం, మే 11: రంపచోడవరం ఐటీడీఏ కరోనా కోరల్లో చిక్కుకుంది. మంగళవారం ఐటీడీఏ ఉద్యోగి ఒకరు రాజమహేంద్రవరం కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉద్యోగి మరణంతో ఆయనతో కలిసిన వారందరూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఐటీడీఏలో సుమారు

కరోనా కోరల్లో రంప ఐటీడీఏ

-రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతూ ఉద్యోగి మృతి

రంపచోడవరం, మే 11: రంపచోడవరం ఐటీడీఏ కరోనా కోరల్లో చిక్కుకుంది. మంగళవారం ఐటీడీఏ ఉద్యోగి ఒకరు రాజమహేంద్రవరం కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఉద్యోగి మరణంతో ఆయనతో కలిసిన వారందరూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఐటీడీఏలో సుమారు 9 మంది వరకూ కరోనా బారినపడ్డారు. ఐటీడీఏకు అనుబంధంగా ఉండే గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్‌ కార్యాలయంలో అత్యధికంగా ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దేవీపట్నం పీహెచ్‌సీ వైద్యాధికారి ఒకరు కరోనా బారినపడ్డారు. మూడు రోజులుగా నలతగా ఉండటంతో ఆయన పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఆయన కూడా ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  


ఉపాధిహామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ మృతి

వరరామచంద్రాపురం, మే 11: కరోనా పాజిటివ్‌తో ఉపాధి హామీ టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ సోమవారం రాత్రి మృతిచెందారు. మండల పరిధిలోని వడ్డిగూడెం గ్రామానికి చెందిన ఆయన కూనవరం మండలంలోని విధులు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం బాగోలేక కొవిడ్‌ టెస్టు చేయించుకోగా పాజిటివ్‌ రావడంతో రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిసితి విషమించి సోమవారం రాత్రి మృతిచెందాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. 


Updated Date - 2021-05-12T05:19:30+05:30 IST