అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌గా ఫ్లోరిడా!

ABN , First Publish Date - 2021-08-02T06:24:32+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగిపోతోంది. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనన్ని కేసులు నమోదవుతు

అమెరికాలో కరోనా హాట్‌స్పాట్‌గా ఫ్లోరిడా!

ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి విజృంభణ మళ్లీ మొదలైంది. కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగిపోతోంది. ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనన్ని కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఫ్లోరిడాలో 21వేలకు పైగా ప్రజలు కొవిడ్ బారినపడ్డట్టు నిర్ధారణ అయింది. జనవరి 7 నమోదైన 19,334 కేసులే అక్కడ ఇప్పటి వరకు అత్యధికంగా ఉండగా.. తాజాగా 21వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ఐదో వంతు ఇక్కడే వెలుగు చూస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రం మహమ్మారికి కేంద్ర బిందువుగా మారిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. 


ఇదిలా ఉంటే.. ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసెంటిస్ వైఖరిపై పెద్ద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో మాస్కు ధరించడం, టీకా తీసుకోవడం తప్పనిసరి అనే నిబంధనలు విధించేందుకు ఆయన వెనకడుగు వేస్తున్నారు. అంతేకాకుండా పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-08-02T06:24:32+05:30 IST