హైదరాబాద్‌లో కఠిన చర్యలు.. మాస్క్ లేకుంటే జరిమానా, కేసులు

ABN , First Publish Date - 2021-04-11T18:03:23+05:30 IST

కరోనా నిబంధనలపై నగర పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

హైదరాబాద్‌లో కఠిన చర్యలు.. మాస్క్ లేకుంటే జరిమానా, కేసులు

హైదరాబాద్: కరోనా నిబంధనలపై నగర పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. మాస్క్ లేకుండా బయటకి వస్తే జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధుల్లో కోవిడ్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించకుండా, గుంపులు గుంపులుగా జనం ఉంటే కేసులు నమోదులు చేస్తామని హెచ్చరించారు. 


మాస్కులు లేకుండా బయట తిరిగితే ‘పెట్టీ కేసులు’ నమోదు చేయనున్నట్టు తెలిపారు. షాపింగ్ మాల్స్, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో నిబంధనలను పక్కాగా పాటించాలని చెబుతున్నారు. కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే షాపు యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్, ఏపీడెమిక్ డీసీసెస్ చట్టం కింద కేసులు నమోదు చేయనున్నారు. 

Updated Date - 2021-04-11T18:03:23+05:30 IST