జిల్లాలో 2,876 మందికి సోకిన వైరస్‌

ABN , First Publish Date - 2021-05-17T05:57:56+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి అదే జోరు కొనసాగిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాలనూ కమ్మేస్తోంది. గడిచిన వారంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కడా తగ్గకపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు.

జిల్లాలో 2,876 మందికి   సోకిన వైరస్‌

  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,83, 062
  ఒక్క రోజులో తొమ్మిది మంది మృతి

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 16: కొవిడ్‌ మహమ్మారి అదే జోరు కొనసాగిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాలనూ కమ్మేస్తోంది. గడిచిన వారంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కడా తగ్గకపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రతీరోజూ దాదాపు మూడు వేలకు కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు  చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా బెడ్లు దొరకని పరిస్థితి కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా ఆదివారం 2,876 మంది వైర స్‌ బారిన పడ్డారు. ఈ వారమంతా ఇదే స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రిలలో ఆక్సిజన్‌ బెడ్లు దొరక్క ప్రజలు విలవిల్లాడుతున్నారు. జిల్లా యంత్రాంగం అహర్నిశలూ కష్టపడి వందలాది ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులోకి తెస్తున్నా గంటల్లో నిండిపోతున్నాయి. ఆదివారం నాటి కేసులతో మొత్తం జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య 1,83,062కు చేరుకుంది. ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న యాక్టివ్‌ కేసులు 29,091గా నమోదయ్యాయి. మరోపక్క కొవిడ్‌ మరణాలు ఆదివారం జిల్లాలో తొమ్మిది సంభవించాయి.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 838కు చేరింది.

జిల్లాలో వారం రోజుల్లో 67 మరణాలు సంభవించాయి. మొత్తంగా ఆదివారం నాటికి జిల్లాలో 1,53,133 మంది కోలుకున్నారు. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌లు గత వారంలో నమోదయ్యాయి. రోజూ వందలాది మంది కొవిడ్‌ టెస్టుల కోసం పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్‌, డీహెచ్‌, కిమ్స్‌ ఆసుపత్రుల వద్ద బారులు తీరుతున్నారు. బాధితుల సంఖ్య, లక్షణాలు ఉన్నవారు అంతకంతకూ పెరిగిపోతుండడంతో టెస్టుల చేయించుకోవడానికి పోటెత్తుతున్నారు. ఆదివారం మొత్తం పాజిటివ్‌ల్లో కాకినాడ అర్బన్‌లో 277 నమోదు కాగా... ఆ తర్వాతి స్థానంలో రాజమహేంద్రవరం అర్బన్‌లో 248 నమోదయ్యాయి. నెల్లిపాకలో 109, అంబాజీపేటలో 108, అయినవిల్లిలో 103, కరపలో 101, కాకినాడ రూరల్‌లో 100 పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. సామర్లకోట 91, మామిడికుదురు 90, ఐ.పోలవరం 89, పెద్దాపురం 81, రాజానగరం 75, అల్లవరం 73, రంపచోడవరం 73, రాజమహేంద్రవరం రూరల్‌ 68, పిఠాపురం 66, కాట్రేనికోన 58, కరప 58, కోరుకొండ 56, చింతూరు 50 కేసులు నమోదయ్యాయి. రోజూ వేలల్లో పొజిటివ్‌లు రావడం, అందులో వందలాది మంది ఆక్సిజన్‌ పడకల్లో చేరడంతో జిల్లాలో ఆక్సిజన్‌ వినియోగం జిల్లాలో భారీగా పెరిగింది.

Updated Date - 2021-05-17T05:57:56+05:30 IST