ప్రపంచంలోనే అతిపెద్ద cruise shipలో 48 మందికి కొవిడ్

ABN , First Publish Date - 2021-12-21T16:34:45+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్‌లో 48 మంది ప్రయాణికులకు కొవిడ్ సోకడం కలకలం రేపింది....

ప్రపంచంలోనే అతిపెద్ద cruise shipలో 48 మందికి కొవిడ్

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్‌లో 48 మంది ప్రయాణికులకు కొవిడ్ సోకడం కలకలం రేపింది. రాయల్ కరేబియన్స్ సింఫనీ ఆఫ్ ది సీస్ అనే క్రూయిజ్ షిప్ లో కరోనాను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పుడు 48 కొవిడ్ కేసులు వెలుగుచూడటం సంచలనం రేపింది.ఓడలో 6,000 మంది ప్రయాణికులు ఉన్నారు. 48మందికి కరోనా సోకడంతో ఈ వారాంతంలో మయామిలో ఓడను నిలిపివేశారు. క్రూయిజ్ షిప్ లో కాంటాక్ట్ ట్రేసింగులో ఓ ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. ఓడలో ఉన్న ప్రయాణికుల్లో 95 శాతం మందికి పూర్తిగా రెండు డోసుల టీకాలు వేశారు. ఓడలో కరోనా సోకిన వారికి ఒమైక్రాన్ వేరియెంట్ కాదో ఇంకా గుర్తించలేదు. 


ఓడలో కరోనా కలకలంతో ప్రయాణికులందరినీ క్వారంటైన్ కు తరలించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. కరోనా పాజిటివ్ అని వచ్చిన ప్రయాణికుల్లో తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని, వారికి చికిత్స అందిస్తున్నామని రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్ అధికారులు చెప్పారు. 


Updated Date - 2021-12-21T16:34:45+05:30 IST