మరింత వేగంగా పెరుగుతున్న Covid కేసులు

ABN , First Publish Date - 2022-01-05T17:36:38+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ను ధీటుగా అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐఏఎస్‌ అధికారి మనీష్ మౌద్గిల్‌

మరింత వేగంగా పెరుగుతున్న Covid కేసులు

బెంగళూరు: కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రోజురోజుకు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్‌వేవ్‌ను ధీటుగా అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఐఏఎస్‌ అధికారి మనీష్ మౌద్గిల్‌ అధ్యక్షతన కొవిడ్‌-19 వార్‌ రూంను ఏర్పాటు చేసింది. బీబీఎంపీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితిని వార్‌ రూం ప్రతిరోజూ సమీక్షిస్తుంది. కాగా ఐఎల్‌ఐ, ఎస్‌ఏఆర్‌ఐ కేసులను 108 అంబులెన్స్‌ పర్యవేక్షణకోసం ఐఏఎస్‌ అధికారి ఆర్‌ వినోదప్రియ అధ్యక్షతన మరో కమిటీ ఏర్పాటైంది. కొవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌, టెస్టింగ్‌, ల్యాబ్‌ల పర్యవేక్షణను ఏఐఎస్‌ అధికారిని శాలినీ రజనీష్‌ పర్యవేక్షిస్తారు. హోం ఐసొలేషన్‌, కంటైన్‌మెంట్‌ జోన్‌ల వ్యవహారాన్ని ఐఏఎస్‌ అధికారి పంకజ్‌కుమార్‌ పాండే పర్యవేక్షిస్తారు. లిక్విడ్‌ ఆక్సిజన్‌, ట్యాంకర్‌ల పర్యవేక్షణను ఐఏఎస్‌ అధికారులు ప్రతా్‌పరెడ్డి, డాక్టర్‌ ఎన్‌ శివశంకర్‌ చూస్తారు. రాష్ట్రస్థాయిలో టెలీ కౌన్సెలింగ్‌, హెల్ప్‌లైన్‌లను ఐఏఎస్‌ అధికారి విపిన్‌సింగ్‌, బిస్వజిత్‌ మిశ్రా పర్యవేక్షిస్తారు. ప్రైవేటు, ఎన్జీఓ, కార్పొరేట్‌జోన్‌ల సమన్వయాన్ని ఐఏఎస్‌ అధికారి ఉమా మహదేవన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు 11 ప్రత్యేక విభాగాల పర్యవేక్షణ బాధ్యతలను నోడల్‌ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తాజా బులెటిన్‌లో బెంగళూరు కరోనా కేసుల పెరుగుదల కొనసాగుతోంది. బెంగళూరులో మినహా రా ష్ట్రంలో మరెక్కడా కేసుల తీవ్రత లేదు.

Updated Date - 2022-01-05T17:36:38+05:30 IST