కొత్తలంకలోనూ కొవిడ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-05-30T09:40:48+05:30 IST

ముంబై నుంచి వచ్చి శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల కార్వంటైన్‌ సెంట ర్‌లో ఉండి ఇంటికి వెళ్లిన ఓ కుటుంబానికి, క్వారంటైన్‌లో

కొత్తలంకలోనూ కొవిడ్‌ కేసులు

ముమ్మిడివరం, మే 29: ముంబై నుంచి వచ్చి శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల కార్వంటైన్‌ సెంట ర్‌లో ఉండి ఇంటికి వెళ్లిన ఓ కుటుంబానికి, క్వారంటైన్‌లో ఉన్న మహిళ, మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై వారిని అంబులెన్సులో అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రి కొవిడ్‌ సెంటర్‌కు తరలించారు. ముంబైలోని ఠాణే నుంచి ఈ నెల 24న ముమ్మిడివరం మండలం కొత్తలంక, చినకొత్తలంక గ్రామాలకు చెందిన 28 మంది రాగా వారిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముంబై నుంచి వచ్చిన వీరందరినీ అదేరోజు శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల క్వారంటైన్‌ సెంటర్‌లో ఉంచారు. ముమ్మిడివరం నగర పంచాయతీ సూరాయిచెరువుకు చెంది న 45 ఏళ్ల వ్యక్తి ముంబై నుంచి వచ్చి స్వచ్ఛందంగా క్వారంటైన్‌కు వెళ్లాడు. ఆ క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 36 మందికి 25న శాంపిల్స్‌ తీసి కాకినాడ పరీక్షలకు పంపారు.


అయితే గురువారం ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో చిన్న పిల్లలు, గర్భవతులు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా వారికి శాంపిల్స్‌ తీసి హోంక్వారంటైన్‌కు పంపించాలని సూచించడంతో శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాలలో క్వారంటైన్‌లో ఉన్న ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన భార్యాభర్తలు, 7 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వయస్సున్న పిల్లలను గురువారం సాయంత్రం ఇంటికి పంపించి వేశారు.


అయితే శుక్రవారం ఉదయం వచ్చిన శాంపిల్స్‌ ఫలితాల్లో కొత్తలంకకు చెందిన ఆ భార్యాభర్త లు, ఇద్దరు పిల్లలకు, క్వారంటైన్‌లో ఉన్న కొత్తలంకకు చెందిన 42 ఏళ్ల మహిళ, ముమ్మిడివరం నగర పంచాయతీ సూరాయిచెరువుకు చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయింది. వీరందరినీ కిమ్స్‌ కొవిడ్‌ సెంటర్‌కు తరలించారు. డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, ముమ్మిడివరం సీఐ బి.రాజశేఖర్‌, ముమ్మిడివరం, కాట్రేనికోన ఎస్‌ఐలు ఎం.పండుదొర, ఎస్‌.సంపత్‌కుమార్‌, తహశీల్దార్‌ ఎస్‌.పోతురాజు, ఎంపీడీవో డి.రాంబాబు, వైద్యాధికారి బి.వినీల్‌లు పరిస్థితులను సమీక్షించారు.

Updated Date - 2020-05-30T09:40:48+05:30 IST