కొవిడ్‌ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

ABN , First Publish Date - 2021-06-19T06:27:00+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.

కొవిడ్‌ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేస్తున్న టీడీపీ శ్రేణులు

మాజీ మంత్రి చినరాజప్ప... డివిజన్‌ కార్యాలయాల వద్ద టీడీపీ ధర్నాలు
పెద్దాపురం, జూన్‌ 18 : రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తికి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. టీడీపీ అధి ష్ఠానం ఆదేశాల మేరకు కొవిడ్‌ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లాలోని డివిజన్‌ కార్యాలయాల వద్ద పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వద్ద తుని, ప్రత్తిపాడు, కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి జ్యోతుల నవీన్‌, యనమల కృష్ణుడు, వరుపులు రాజాలతో కలిసి చినరాజప్ప ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగానే కొవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. అనంతరం యనమల కృష్ణు డు, వరుపుల రాజా,  జ్యోతుల నవీన్‌ మాట్లాడుతూ ప్రతీ తెల్లరేషన్‌ కార్డు కుటుంబానికి  రూ.10 వేలు, కొవిడ్‌తో ఉపాధి కోల్పోయినవారికి రూ.10 వేలు, ఆక్సిజన్‌ మరణాలన్నీంటికీ ప్రభుత్వమే కారణం కనుక వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు అందజేయాలన్నారు. కొవిడ్‌ మృతుల దహన సంస్కారాలకు రూ.15 వేల సహాయం అందించాలన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి  కాకినాడ రామారావు, మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజాసూరిబాబురాజు, అన్నవరం ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనే రామారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-19T06:27:00+05:30 IST