16 జిల్లాల్లో 10లోపు Covid కేసులు

ABN , First Publish Date - 2022-02-22T19:38:06+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింతగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 679 మంది బాధితులు కాగా 16 జిల్లాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 346 మంది, శివమొగ్గలో 34,

16 జిల్లాల్లో 10లోపు Covid కేసులు

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింతగా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 679 మంది బాధితులు కాగా 16 జిల్లాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 346 మంది, శివమొగ్గలో 34, బళ్లారిలో 31, కొడగులో 28 మంది బాధితులు నమోదయ్యారు. ఇతర జిల్లాల్లో 10-30 మధ్య కేసులు వెలుగు చూశాయి. 1932 మంది కోలుకోగా 21 మంది మృతిచెందారు. బెంగళూరులో 8 మంది, బళ్లారిలో నలుగురు, రెండు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఐదు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ప్రస్తుతం 11,360 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,633 మంది ఉన్నారు. 

Updated Date - 2022-02-22T19:38:06+05:30 IST