జ్వరానికి చికిత్స కోసం వచ్చి

ABN , First Publish Date - 2020-08-10T09:27:10+05:30 IST

విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ కొవిడ్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గుంటూరు జిల్లా నిడుబ్రోలుకు చెందిన కొసరాజు సువర్ణలత(42) మృతిచెందారు. ఆమెకు గురువారం

జ్వరానికి చికిత్స కోసం వచ్చి

  • నిడుబ్రోలు మహిళ దుర్మరణం.. 
  • పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు

పొన్నూరు టౌన్‌, ఆగస్టు 9: విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ కొవిడ్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గుంటూరు జిల్లా నిడుబ్రోలుకు చెందిన కొసరాజు సువర్ణలత(42) మృతిచెందారు. ఆమెకు గురువారం జ్వరం రావడంతో స్థానికంగా వైద్యపరీక్షలు చేయించారు. టైఫాయిడ్‌, మలేరియా లక్షణాలు ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. స్థానికంగా ఏ ఆస్పత్రిలోనూ వైద్యం అందకపోవడంతో ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు ఆమెను అదేరోజు స్వర్ణ ప్యాలెస్‌ కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లోని రెండో అంతస్తు గదిలో ఉంచి వైద్యం అందించారు. ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె మృత్యువాత పడింది. సువర్ణలతకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఆమె మృతదేహానికి నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-08-10T09:27:10+05:30 IST