బోడసకుర్రులో 2 వేల పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2020-07-02T10:08:20+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అల్లవరం మండలం బోడసకుర్రులో నిర్మించి టిడ్కో భవన

బోడసకుర్రులో 2 వేల పడకలతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌

జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి వెల్లడి

వారం రోజుల్లోగా ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం


అమలాపురం, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అల్లవరం మండలం బోడసకుర్రులో నిర్మించి టిడ్కో భవన సముదాయంలో 2 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌, ప్రభుత్వ కార్వంటైన్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ డీ మురళీధర్‌రెడ్డి తెలిపారు. బుధవారం టిడ్కో భవన సముదాయాన్ని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే 15 కొవిడ్‌ ఆసుపత్రులు ఉన్నాయని, 3 వేల పడకల సామర్థ్యంతో బొమ్మూరులో కొవిడ్‌ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


బోడసకుర్రులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు అన్ని సదుపాయాలు అనువుగా ఉన్నాయని చెప్పారు. కరోనా పాజిటివ్‌ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికైనా రావచ్చని, దీని నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న అన్నిరకాల చర్యలకు ప్రజలు సహకరించాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగితే కేసులు నమోదుచేసి కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరిం చారు. రోగులకు ఆహారాన్ని ఈ సెంటర్‌లోనే తయారుచేసే ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో బీహెచ్‌ భవనీశంకర్‌కు సూచించారు. ఈ పర్యటనలో డీఎస్పీ షేక్‌ మసూమ్‌బాషా, కమిషనర్‌ కేవీఆర్‌ఆర్‌ రాజు, జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్‌ సీహెచ్‌ పుష్కరరావు, డీఈ కె.అప్పలరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T10:08:20+05:30 IST