కొవిడ్ కేర్ సెంటర్‌గా మారనున్న శివసదన్ భవనం
శ్రీకాళహస్తి, జనవరి 17: పట్టణంలోని శివసదన్‌లో బుధవారం నుంచి కొవిడ్ కేర్ సెంటర్‌ను పునఃప్రారంభించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా పాజిటివ్ బాధితులకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ కేంద్రం ఏర్పాటులో జాప్యంపై ఈనెల 13న ‘అప్రమత్తత ఏదీ?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు శివసదన్ భవనాన్ని కేటాయించేందుకు గ్రీన్‌సిగ్నలిచ్చారు.