May 17 2021 @ 01:28AM

కొవిడ్‌ ఆ మార్పు తీసుకొచ్చింది!

‘‘కరోనా మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడినప్పటి నుంచి... ప్రతి ఒక్కరూ కుటుంబం యొక్క విలువ తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా గతేడాది నుంచి... కరోనా తెలుసుకునేలా చేసింది. ఇంతకు ముందెప్పుడూ మనం అర్థం చేసుకోలేదు’’ అని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అన్నారు. మనుషుల్లో కొవిడ్‌ ఆ మార్పు తీసుకొచ్చిందన్నారు. అర్జున్‌ కపూర్‌కు జంటగా రకుల్‌ నటించిన  ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ మంగళవారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. థియేటర్ల కోసం తీసిన ఈ సినిమాను పరిస్థితుల కారణం ఓటీటీలో ప్రజలకు చూపిస్తున్నామని రకుల్‌ చెప్పారు.