హైదరాబాద్‌లో ఇక్కడ కొవిడ్‌ పడకలు ఖాళీ

ABN , First Publish Date - 2021-04-16T18:08:47+05:30 IST

కరోనా విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లను చేసింది.

హైదరాబాద్‌లో ఇక్కడ కొవిడ్‌ పడకలు ఖాళీ

హైదరాబాద్‌ : కరోనా విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లను చేసింది. నగరంలో కొవిడ్‌ చికిత్సకు ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, టిమ్స్‌తో పాటు మరికొన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ప్రారంభించింది. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగరంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పేషెంట్ల సంఖ్య, ఖాళీ బెడ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 


గురువారం సాయంత్రం 6 గంటల వరకు

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం 800 పడకలను కేటాయించగా, ప్రస్తుతం 282 మంది చికిత్స పొందుతున్నారు. 518 పడకలు ఖాళీగా ఉన్నాయి.

టిమ్స్‌లో 1000 పడకలకు గాను 480 మంది చికిత్స పొందుతున్నారు. 520 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

కింగ్‌కోఠిలో 400 పడకల సామర్థ్యం ఉండగా 287 మంది చికిత్స పొందుతున్నారు. 113 పడకలు అందుబాటులో ఉన్నాయి.

నేచర్‌క్యూర్‌లో 280 పడకల్లో 152 మంది చికిత్స పొందుతున్నారు. మరో 128 పడకలు అందుబాటులో ఉన్నాయి.

ఎర్రగడ్డ ఛాతీ వైద్యశాలలో 124 పడకలు ఉండగా 96 మందికి చికిత్స అందిస్తున్నారు. 28 పడకలు ఖాళీగా ఉన్నాయి.

ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో 220 పడకలు ఉండగా, 35 మంది చికిత్స పొందుతున్నారు. 185 పడకలు అందుబాటులో ఉన్నాయి.

Updated Date - 2021-04-16T18:08:47+05:30 IST