కరోనా బాధితుల కోసం కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-07T03:26:36+05:30 IST

కరోనా బాధితులను ఆదుకునేందుకు నియోజకవర్గవ్యాప్తంగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూ

కరోనా బాధితుల కోసం కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు
వ్యాక్సిన్‌ వివరాలను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి

ముత్తుకూరు, మే6: కరోనా బాధితులను ఆదుకునేందుకు నియోజకవర్గవ్యాప్తంగా కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆయన పర్యటించి, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోందన్నారు. కరోనా బారిన పడిన వారికోసం అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రాల్లో 108 వాహనాలతో పాటు, అదనంగా వాహనాలు సిద్ధం చేశామని తెలిపారు. కరోనా బాధితులకు అసుపత్రుల్లో పడకల ఏర్పాటు చేయడంతోపాటు, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామ న్నారు. వైద్యులు పరిస్థితులను పరిశీలించి, అవసరం ఉన్నవారికి ఐసోలేషన్‌ కిట్లు అందించి, సహాయక నర్సుల ద్వారా పర్యవేక్షించాలన్నారు. కరోనా పట్ల ఆందోళన చెందవద్దని, స్వీయనియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి, అందుబాటులో ఉన్న 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేసి పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ మెట్టా విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు కాకుటూరు లక్ష్మణరెడ్డి, నెల్లూరు ప్రసాద్‌, తహసీల్దారు సోమ్లానాయక్‌, పీహెచ్‌సీ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-07T03:26:36+05:30 IST