కొవిడ్‌ కిట్ల మాయం

ABN , First Publish Date - 2020-08-11T10:58:50+05:30 IST

కొవిడ్‌ ర్యాపిడ్‌ కిట్‌లు మాయమయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది.

కొవిడ్‌ కిట్ల మాయం

కాకినాడ(ఆంధ్రజ్యోతి) ఆగస్టు 10: కొవిడ్‌ ర్యాపిడ్‌ కిట్‌లు మాయమయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది.  కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లే కరోనా అనుమానితులకు వైరస్‌ నిర్ధారణ నిమిత్తం 300 ర్యాపిడ్‌ కిట్‌లను పంపించాలని జీజీహెచ్‌ అధికారులు డీఎంహెచ్‌వో కార్యాలయానికి ఇండెంట్‌ పంపారు. అయితే జీజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో పనిచేసే ఒక ఎంఎన్‌వో జీజీహెచ్‌ కొవిడ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆ లెటర్‌తో డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. దీంతో అతనికి డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది ర్యాపిడ్‌ కిట్లను అందించారు. కాని ఈ కిట్‌లు  జీజీహెచ్‌కు చేరలేదు. కిట్‌లు రాకపోవడంతో జీజీహెచ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బందిని ఆరా తీశారు.  ఎంఎన్‌వోకు ఇచ్చామని సమాధానం చెప్పారు. అయితే సదరు కిట్‌లు దొడ్డిదారి పట్టాయని గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది.

Updated Date - 2020-08-11T10:58:50+05:30 IST