ఎమ్మెల్యే భార్యకు కరోనా..ఎమ్మెల్యే, అతని సిబ్బంది క్వారంటైన్

ABN , First Publish Date - 2020-07-15T12:15:33+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని అర్సికెరి ఎమ్మెల్యే శివలింగగౌడ భార్యకు కరోనా వైరస్ సోకింది....

ఎమ్మెల్యే భార్యకు కరోనా..ఎమ్మెల్యే, అతని సిబ్బంది క్వారంటైన్

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని అర్సికెరి ఎమ్మెల్యే శివలింగగౌడ భార్యకు కరోనా వైరస్ సోకింది. మంగళవారం జరిపిన పరీక్షల్లో ఎమ్మెల్యే భార్యకు కరోనా పాజిటివ్ అని రిపోర్టు రావడంతో ఎమ్మెల్యేతోపాటు అతని సిబ్బంది హోంక్వారంటైన్‌లోకి వెళ్లారు. తన భార్యకు కరోనా సోకడంతో ఆమెను హాసన్ పట్టణంలోని ఆసుపత్రిలో చేర్పించామని ఎమ్మెల్యే శివలింగ గౌడ చెప్పారు. తన కుటుంబసభ్యులతోపాటు సిబ్బంది పరీక్షలు చేయించుకోగా తామందరికీ కరోనా నెగిటివ్ అని వచ్చిందని ఎమ్మెల్యే చెప్పారు. తన భార్యకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, అందువల్ల త్వరగా ఆమె కోలుకుంటుందని చెప్పారు. తాను హోంక్వారంటైన్ లో ఉన్నందున వారం రోజుల పాటు తనను కలిసేందుకు ఇంటికి రావద్దని, ఏవైనా సమస్యలుంటే తనకు ఫోన్ లో చెప్పాలని ఎమ్మెల్యే శివలింగ కోరారు. 

Updated Date - 2020-07-15T12:15:33+05:30 IST