విద్యార్థులపై కరోనా పంజా!

ABN , First Publish Date - 2021-09-08T06:52:42+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

విద్యార్థులపై కరోనా పంజా!

జిల్లావ్యాప్తంగా వివిధ   పాఠశాలల్లో విద్యార్థులకు పాజిటివ్‌

కరోనా బారిన పడుతున్న టీచర్లు

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

పాఠశాలల్లో కొరవడిన శానిటేషన్‌

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులపై కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య  పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సైతం వైరస్‌ సోకుతోంది. దాంతో అప్రమత్తమైన వైద్యఆరోగ్యశాఖ అధికారులు ఆయా పాఠశాలల్లోని మొత్తం విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి విద్యా లయాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. వందల మంది విద్యార్థులు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు కరోనా బారిన పడి కోలు కుంటున్నారు. జిల్లాలో మంగళవారం వైద్యఆరోగ్యశాఖ విడు దల చేసిన బులెటిన్‌ ప్రకారం 72 పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. జిల్లాలో మొత్తం ఇప్పటివరకు 2,87,007 కేసు లుకాగా వాటిలో 2,177 యాక్టివ్‌ కేసులుగా ఉన్నాయి. ఇప్ప టివరకు 2,83,566 మంది కోలుకున్నారు. 1264 మంది మృతిచెందినట్టు అధికార లెక్కలు తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యే ఎక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అంటే జిల్లాలోని పాఠశాలల్లో కరోనా వైరస్‌ చాపకింద నీరు లా విస్తరిస్తోందనే చెప్పాలి. అమలాపురం రూరల్‌ మండ లం బండారులంక జిల్లా పరిషత్‌ హైస్కూలులో ముగ్గురు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వారిలో ఒక విద్యార్థిని తండ్రికి కూడా పాజిటివ్‌ వచ్చింది. అంబాజీపేట మండలం గంగలకుర్రులో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం జడ్పీ పాఠశాలకు చెంది ఉపాధ్యాయుడికి, ఐ.పోలవరం స్కూలుకు చెందిన ఒక విద్యార్ధికి కరోనా సోకింది. సామర్ల కోట మండలంలో సుమారుగా 35 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. కాట్రేనికోనలో ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. మామిడికుదురు మండలంలో ఒక ఉపాధ్యాయుడు, ఆరుగురు  విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ సోకింది. పి.గన్నవరం మండలంలో ఇద్దరు ఉపాధ్యా యులకు పాజిటివ్‌ వచ్చింది. సఖినేటిపల్లి మండలంలో ఒక ఉపాధ్యాయుడు, పద్నాలుగు మంది విద్యార్థులకు కరోనా సోకింది. రామచంద్రపురం పట్టణంలో మున్సిపల్‌  బాలికో న్నత పాఠశాల హెచ్‌ఎంకు, ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌ నిర్థారణ అయింది. మరో పాఠశాలలో ఒక ఉపాధ్యాయు డికి, ఉప్పలగుప్తం మండలం చినగడావల్లి గరువు పాఠ శాలలో ఓ టీచర్‌కు పాజిటివ్‌ రావడంతో మొత్తం ఉపా ధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అల్లవరం మండలం దేవగుప్తంలో ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. అనపర్తి మండలంలో ఇప్పటివరకు పన్నెండు మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. ఇలా జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, విద్యా ర్థులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంతో మిగిలిన తరగతుల విద్యార్థులకు సైతం వైద్య పరీక్షలు నిర్వహిం చడంలో ఆరోగ్యశాఖ సిబ్బంది నిమగ్నమయ్యారు. ప్రభు త్వ పాఠశాలల్లో కరోనా నివారణా చర్యలు తీసుకోవ డంలో అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి కేసుల పెరుగుదలకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శానిటైజేషన్‌ సక్రమంగా చేయడంలేదనేది విద్యార్థుల తల్లిదండ్రుల ఆరోపణ. ముఖ్యంగా ఉపాధ్యాయులు రెండు డోస్‌ల టీకాలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతున్నారు. దీనికితోడు వాతావరణంలో వస్తున్న మార్పులు, ముఖ్యం గా వర్షాల వల్ల జలుబు, జ్వరం వంటివి సోకడంతో అవి కరోనాగా నిర్ధారణ అవుతున్నాయని.. ఈ పరిణామాల వల్లే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు పంపించాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల విషయా నికొస్తే ఎవరికైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వారిని పాఠశాలకు రాకుండా తదుపరి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైన్‌ తరగతుల విధానం కూడా అమలులో ఉండడంతో పెద్దగా సమస్య కనిపించడంలేదని చెబుతున్నారు.



Updated Date - 2021-09-08T06:52:42+05:30 IST