నేటి నుంచి టీకా

ABN , First Publish Date - 2021-01-16T05:29:27+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుడుతున్నారు.

నేటి నుంచి టీకా

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం..

జిల్లాలో 31 కేంద్రాల్లో అమలు

ప్రతి కేంద్రంలో 100 మందికి టీకాలు 

ప్రతి పీహెచ్‌సీకి 500 డోసుల పంపిణీ

వారంలో నాలుగు రోజుల పాటు నిర్వహణ


 గుంటూరు (మెడికల్‌), జనవరి 15: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుడుతున్నారు. ప్రతి కేంద్రంలో రోజుకు 100 మం దికి టీకా సూది మందు ఇస్తారు.  తొలివిడగా జిల్లాకు 43,500 వ్యాక్సిన్‌లు అందాయి. ఇప్పటికే ఒక్కో కేంద్రానికి 500 డోసుల వ్యాక్సిన్‌లను పంపిణీ చేశారు. 114 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రభు త్వ పాఠశాలలను వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేశారు. దీంతో పాటు జిల్లాలో 36 ప్రైవేటు ఆసుపత్రులను కూడా వ్యాక్సినేషన్‌ సెంటర్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం 31 కేంద్రాల్లోనే కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించినా అనంతరం దశలవారీగా ఇతర కేంద్రాల్లో కూడా టీకాలు వేస్తామని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్‌ తీరును నిరంతరం పరిశీలించేందుకు డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ నేతృత్వరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు.  క్షేత్రస్థాయిలో ఆరోగ్య శాఖకు చెందిన 13 మంది ప్రోగ్రామ్‌ ఆఫీసర్లను నియమించారు. ఆయా వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో జనరేటర్‌ బ్యాక్‌అప్‌, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఆరోగ్యపరమైన దుష్ఫలితాలు ఉంటే చికిత్సలు అందించేందుకు జిల్లాలో 15  ఏఈ ఎఫ్‌ఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు.  వీటి పర్యవేక్షాణాఽధికారిగా అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయసింహను నియమించారు. 


14 మందికి కరోనా

గుంటూరు, జనవరి 15 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలో కొత్తగా 14 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఉదయం వరకు 2,323 ల్యాబ్‌ శాంపిల్స్‌ ఫలితాలు విడుదల కాగా వారిలో 0.60 శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గుంటూరు నగరంలో 2, తాడేపల్లిలో 2, పెదకాకానిలో 2, గుర జాలలో 2, అమరావతి, పెదకూరపాడు, పెదనందిపాడు, మాచవరం, శావల్యా పురం, బాపట్లలో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదు అయ్యాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కొవిడ్‌-19 బారిన పడిన వారి సంఖ్య 76,876కి చే రుకోగా వారిలో 75,835(98.65 శాతం) మంది కోలుకొన్నారు. 310 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2021-01-16T05:29:27+05:30 IST