130 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-08-04T06:17:54+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మంగళవారం 7,401 కరోనా శాంపిల్స్‌ పరీక్షించగా 130 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది.

130 మందికి కరోనా



పాజిటివ్‌ రేట్‌ 1.76 శాతం

కొవిడ్‌తో తాజాగా ఇద్దరు మృతి


గుంటూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మంగళవారం 7,401 కరోనా శాంపిల్స్‌ పరీక్షించగా 130 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది.   పాజిటివ్‌ శాతం 1.76కి తగ్గింది. కొవిడ్‌తో పిట్టలవానిపాలెం, నకరికల్లులో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందగా క్రియాశీలక కేసులు 1,635కి పెరిగాయి. కొత్తగా గుంటూరు నగరంలో 31 మందికి కరోనా సోకింది. ముత్యాలరెడ్డినగర్‌, రౌతునగర్‌, తారకరామనగర్‌, విద్యానగర్‌, కేవీపీ కాలనీ, శుద్ధపల్లి డొంక, ఎస్‌వీఎన్‌కాలనీ, బాలాజీనగర్‌, బృందావన్‌గార్డెన్స్‌, క్రిష్టియన్‌పేట, చుట్టుగుంట, లక్ష్మీనగర్‌, మాచిరాజువారివీధి, నగరాలు, ఎన్‌ఎస్పీ కెనాల్‌ క్వార్టర్స్‌, ఎన్టీఆర్‌ నగర్‌, పట్టాభిసీతారామనగర్‌, వేళాంగిణినగర్‌ ప్రాంతాల్లో తాజాగా కొత్త కేసులు వెలుగుచూశాయి. నరసరావుపేటలో 13, వినుకొండలో 11, యడ్లపాడులో 7, రేపల్లెలో 7,  పెదకాకానిలో 6, చిలకలూరిపేటలో 6, తెనాలిలో 5, రాజుపాలెంలో 5, తాడేపల్లిలో 4, మంగళగిరిలో 2, మేడికొండూరులో 2, పెదకూరపాడులో 1, పెదనందిపాడులో 1, ప్రత్తిపాడులో 2, సత్తెనపల్లిలో 1, తుళ్లూరులో 1, వట్టిచెరుకూరులో 1, దాచేపల్లిలో 1, దుర్గిలో 1, గురజాలలో 2, కారంపూడిలో 2, పిడుగురాళ్లలో 2, వెల్దుర్తిలో 3, ఈపూరులో 1, నూజెండ్లలో 1, నకరికల్లులో 2, రొంపిచర్లలో 2, శావల్యాపురంలో 1, అమర్తలూరులో 1, భట్టిప్రోలులో 3, బాపట్లలో 1, చేబ్రోలులో 3, చెరుకుపల్లిలో 1, కొల్లిపరలో 2, నిజాంపట్నంలో 4, చుండూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 2,137, ప్రవాసభారతీయులు 65, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలున్న తల్లులు 1,553, గర్భిణులు 289, దివ్యాంగులు 3, ప్రైవేటు టీచర్లు 16 కలిపి మొత్తం 4,063 మందికి తొలి డోసు టీకా వేశారు. 2,641 మందికి రెండో డోసు టీకా కూడా వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.


బ్రాడీపేటపై ప్రత్యేక దృష్టి

గుంటూరు నగరంలోని బ్రాడీపేటలో కరోనా కేసుల ఎక్కువ సంఖ్యలో వెలుగు చూడటంతో ఆ ప్రాంతంపై నగరపాలకసంస్థ, వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. మంగళవారం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది బ్రాడీపేటలోని కంటైన్‌మెంట్‌ జోన్‌లో పర్యటించారు. కేసులు వెలుగుచూసిన ప్రదేశంలో పెద్ద సంఖ్యలో కరోనా టెస్టులు నిర్వహించారు. ఆర్‌టీపీసీఆర్‌ విధానంలో 10,433 మంది శాంపిల్స్‌ని సేకరించారు. ప్రైవేటు, ప్రభుత్వ యాంటిజెన్‌ టెస్టులు 479 నిర్వహించారు.


Updated Date - 2021-08-04T06:17:54+05:30 IST