ఆగని కరోనా మరణాలు

ABN , First Publish Date - 2021-06-17T05:41:17+05:30 IST

జిల్లాలో కరోనా మరణాలు ఆగడం లేదు. వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతి తగ్గినప్పటికీ చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఆగని కరోనా మరణాలు

ఒకే రోజు తొమ్మిది మంది మృతి

కొత్తగా 361 మందికి పాజిటివ్‌

 

గుంటూరు, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మరణాలు ఆగడం లేదు. వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతి తగ్గినప్పటికీ చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం 9 మంది కొవిడ్‌తో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టగా మరణాలు మాత్రం 15 రోజుల వ్యవధిలోనే 84 చోటు చేసుకున్నాయి. బెల్లంకొండ, మేడికొండూరు, పెదకాకాని, గుంటూరు నగరం, మాచర్ల, చేబ్రోలు, చెరుకుపల్లి, కొల్లూరు, తెనాలిలో ఒక్కొక్కరు కరోనాతో మరణించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. కాగా బుధవారం ఉదయం వరకు 8,676 శాంపిల్స్‌ని టెస్టింగ్‌ చేయగా 361 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. పాజిటివ్‌ శాతం 4.16గా నమోదైంది. హోం ఐసో లేషన్‌లో ఉన్న 300 మంది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ప్రస్తుతం క్రియాశీలక కేసులు 4,437 వద్ద కొనసా గుతున్నాయి. కొవిడ్‌ రికవరీ శాతం 96.55కి చేరింది. కొత్తగా గుంటూరు నగరంలో 36, తాడేపల్లిలో 19, దాచేపల్లిలో 17, సత్తెనపల్లిలో 16, చిలకలూరిపేటలో 15, నరసరావుపేటలో 14, మంగళగిరిలో 12, బొల్లాపల్లిలో 11, తెనాలిలో 10, అమరావతిలో 2, అచ్చంపేటలో 9, బెల్లంకొండలో 2, గుంటూరు రూరల్‌లో 4, క్రోసూరులో 8, మేడికొండూరులో 5, ముప్పాళ్లలో 6, పెదకాకానిలో 9, పెదకూరపాడులో 2, పెదనందిపాడులో 6, ఫిరంగిపురంలో 6, ప్రత్తిపాడులో 4, రాజుపాలెంలో 7, తాడికొండలో 4, తుళ్లూరులో 1, వట్టిచెరుకూరులో 2, దుర్గిలో 3, గురజాలలో 6, కారంపూడిలో 4, మాచవరంలో 8, మాచర్లలో 4, పిడుగురాళ్లలో 7, రెంటచింతలలో 5, వెల్దుర్తిలో 1, యడ్లపాడులో 3, ఈపూరులో 8, నాదెండ్లలో 7, నూ జెండ్లలో 2, నకరికల్లులో 7, రొంపిచర్లలో 8, శావల్యాపురంలో 1, వినుకొండలో 9, అమర్తలూరులో 1, భట్టిప్రోలులో 4, బాపట్లలో 6, చేబ్రోలులో 3, చెరుకుపల్లిలో 2, దుగ్గిరాలలో 3, కాకుమానులో 2, కర్లపాలెంలో 1, కొల్లిపరలో 2, కొల్లూరులో 3, నగరంలో 6, నిజాంపట్నంలో 2, పిట్టలవానిపాలెంలో 1, పొన్నూరులో 8, రేపల్లెలో 4, చుండూరులో 2, వేమూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌ తెలిపారు.


3 వేల మందికిపైగా వ్యాక్సినేషన్‌

కరోనా టీకా ప్రక్రియ జిల్లాలో కొనసాగుతోంది. వ్యాక్సిన్‌ డోస్‌లు తక్కువగా ఉండటంతో కేవలం 3 వేల పైచిలుకు మందికే బుధవారం వ్యాక్సిన్‌ వేశారు. 45 ఏళ్ల వయస్సు దాటిన వారికి 2,142, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ 86, హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ 5, ప్రవాస భారతీయులు 64, ఐదేళ్ల వయస్సు లోపు పిల్లలున్న తల్లులు 759 మందికి తొలి డోసు టీకా వేశారు. సెకండ్‌ డోస్‌ని 246 మందికి వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. 

Updated Date - 2021-06-17T05:41:17+05:30 IST