Covid-19 Vaccination : బిచ్చగాళ్లకు టీకాలివ్వడానికి మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-05-07T17:04:16+05:30 IST

ఫొటో గుర్తింపు కార్డులు లేనివారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేసేందుకు

Covid-19 Vaccination : బిచ్చగాళ్లకు టీకాలివ్వడానికి మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : ఫొటో గుర్తింపు కార్డులు లేనివారికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ చేసేందుకు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇటువంటివారి పేర్లను కోవిన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసే బాధ్యతను జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు అప్పగించింది. జైలు అధికారులు, వృద్ధాశ్రమాల ప్రతినిధులు వంటివారు ప్రధాన ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ బిచ్చగాళ్ళకు, జైలులో నిర్బంధంలో ఉన్నవారికి వ్యాక్సినేషన్ చేయించవచ్చునని తెలిపింది. 


ఫొటో గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాక్సినేషన్ చేయించేందుకు కొన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. వివిధ మతాలకు చెందిన సాధువులు, జైలులో నిర్బంధంలో ఉన్నవారు, మానసిక చికిత్సాలయాల్లో చికిత్స పొందుతున్నవారు, వృద్ధాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, బిచ్చగాళ్లు, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ఫొటో ఐడీ కార్డుల్లో కనీసం ఒకటి అయినా లేని ఇతరులకు ఈ విధానంలో వ్యాక్సినేషన్ చేస్తారు. 


వ్యాక్సినేషన్ చేయించుకోవాలంటే క్రింద పేర్కొన్నవాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాలి. 

- ఆధార్ కార్డు

- ఓటర్ ఐడీ కార్డు

- పాస్‌పోర్టు

- డ్రైవింగ్ లైసెన్స్

- పాన్ కార్డు

- ఎన్‌పీఆర్ స్మార్ట్ కార్డ్

- పింఛను ధ్రువపత్రం


వీరికి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రధాన ఫెసిలిటేటర్ ఇటువంటివారిని గుర్తించి, వ్యాక్సినేషన్ చేయిస్తారు. వీటిలో కనీసం ఒక ఐడీ పత్రం అయినా లేనివారికి వ్యాక్సినేషన్ చేయడం మానకూడదని, వారికి కూడా వ్యాక్సినేషన్ చేయించాలని అనేక విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి.



 

Updated Date - 2021-05-07T17:04:16+05:30 IST