టూరిస్ట్ వీసాదారులకు UAE గుడ్‌న్యూస్!

ABN , First Publish Date - 2021-08-29T13:28:41+05:30 IST

టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది.

టూరిస్ట్ వీసాదారులకు UAE గుడ్‌న్యూస్!

అబుధాబి: టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదించిన కరోనా టీకాలను రెండు డోసులు తీసుకున్న టూరిస్ట్ వీసాదారులు ఆగస్టు 30 నుంచి యూఏఈకి రావచ్చని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌సీఈఎంఏ) వెల్లడించాయి. ఇంతకుముందు ప్రయాణాలు పరిమితం చేసిన దేశాలకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఈ మేరకు ఐసీఏ, ఎన్‌సీఈఎంఏ శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.


"టూరిస్ట్ వీసా కలిగిన ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి. వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులకు(ఆంక్షలు విధించిన దేశాల నుంచి వచ్చే వారికి) ఇంతకుముందు ఉన్న నిబంధనలు అలాగే కొనసాగుతాయి" అని తెలిపాయి. ప్రయాణానికి ముందే టూరిస్ట్ వీసాదారులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్‌ను ఐసీఏ వెబ్‌సైట్‌లో లేదా అల్‌హోస్న్ యాప్‌లో నమోదు చేసుకోవాలని ప్రకటించాయి.      

Updated Date - 2021-08-29T13:28:41+05:30 IST