కోవిడ్ జయించారని ఎస్పీకి మేళతాళాలతో స్వాగతం

ABN , First Publish Date - 2020-09-29T21:31:25+05:30 IST

పోలీస్ అధికారులు.. డీఎస్పీలు.. సీఐలు.. ఉద్యోగులు మేళతాళాలు.. పూర్ణకుంభంతో స్వాగతించారు.

కోవిడ్ జయించారని ఎస్పీకి మేళతాళాలతో స్వాగతం

కాకినాడ: కోవిడ్ నయం కావడంతో మంగళవారం విధుల్లోకి చేరిన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మీకి ఘనస్వాగతం లభించింది. పోలీస్ అధికారులు.. డీఎస్పీలు.. సీఐలు.. ఉద్యోగులు మేళతాళాలు.. పూర్ణకుంభంతో స్వాగతించారు. కార్యాలయనికి విధులకు హాజరైన ఆయనకు దారిపొడవునా పూల వర్షం కురిపించారు.


ఇటీవల అంతర్వేది ఆలయ రధం దగ్ధం అయిన విషయం తెలిసిందే. దీంతో హిందూ సంఘాలు.. ప్రతిపక్ష పార్టీలు సంఘటన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఆ సమయంలో ఎస్పీతో పాటు ఆదనపు ఎస్పీ, మరో 12మంది పోలీసులు  కోవిడ్ బారినపడ్డట్టు ఈనెల 13న డాక్టర్లు తెలిపారు. బందోబస్తు డ్యూటీలో భాగంగా ఆలయం వద్ద విధులు నిర్వహించిన జిల్లా ఎస్పీ నయీమ్ అద్నాన్ అస్మి, అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ దుర్గాశేఖర్ రెడ్డి, ఐదుగురు ఎస్సైలు సహా పలువురు పోలీసు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వీరిని కరోనా క్వారంటైన్‌కు తరలించారు. అయితే 14 రోజుల క్వారంటైన్ తర్వాత మంగళవారం ఎస్పీ తన కార్యాలయానికి వచ్చారు. దీంతో వేద పండితులు పూజలు నిర్వహించారు. మిగిలిన సిబ్బంది పూలు జల్లి స్వాగతం పలికారు. కోవిడ్ జయించి రావడంతో ఇలా తమ బాస్‌కు స్వాగతం పలికినట్లు సిబ్బంది వివరించారు. 

Updated Date - 2020-09-29T21:31:25+05:30 IST