మ‌హ‌మ్మారి విజృంభణ‌.. వ‌ణికిపోతున్న అమెరికా !

ABN , First Publish Date - 2020-07-15T12:54:32+05:30 IST

అదుపులోకి వస్తోందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా వైరస్‌ విజృంభించడంతో అమెరికా వణికిపోతోంది. వైర్‌సపై పోరాటానికి సమగ్ర వ్యూహాన్ని చేపట్టని పక్షంలో అన్ని దేశాల్లో వైరస్‌ ఇలాగే విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.

మ‌హ‌మ్మారి విజృంభణ‌.. వ‌ణికిపోతున్న అమెరికా !

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, జూలై 14: అదుపులోకి వస్తోందని భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరోనా వైరస్‌ విజృంభించడంతో అమెరికా వణికిపోతోంది. వైర్‌సపై పోరాటానికి సమగ్ర వ్యూహాన్ని చేపట్టని పక్షంలో అన్ని దేశాల్లో వైరస్‌ ఇలాగే విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ‘ప్రపంచవ్యాప్తంగా  కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. కొన్ని దేశాల్లో వైరస్‌ అదుపులోకి వచ్చినా చాలా దేశాల్లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది.’ అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ టెడ్రోస్‌ అథనామ్‌ గెబ్రెయేసెస్‌ అన్నారు. కాగా, భారీగా కరోనా పరీక్షలు నిర్వహిస్తు న్న దేశం అమెరికా మాత్రమేనని అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. పరీక్షల విషయంలో భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాల కన్నా తమ దేశమే భేష్‌ అని చెప్పారు. 


అమెరికా మళ్లీ లాక్‌డౌన్‌ బాట!

కరోనా విజృంభణతో కాలిఫోర్నియాలో బార్లు, ఇండోర్‌ డైనింగ్‌ రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, జిమ్‌లు మూతపడనున్నాయి. హెయిర్‌, నెయిల్‌ సెలూన్లపై ఆంక్షలు విధించారు. ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7వేల మందికిపైనే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో సోమవారం 60వేలకుపైనే కేసులు నమోదయ్యాయి.  27రాష్ట్రాలు సడలించిన లాక్‌డౌన్‌ నిబంధనలను తిరిగి కఠినతరం చేస్తున్నాయి. ఆస్ర్టేలియాలో క్వారంటైన్‌ నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. బ్రిటన్‌లో షాపింగ్‌లో మాస్కులు ధరించకపోతే 100 పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. దక్షిణాఫ్రికా 2,87,796 బాధితులతో వైరస్‌ ప్రభావిత దేశాల్లో టాప్‌-10కు చేరుకుంది. పాకిస్థాన్‌లో కేసుల సంఖ్య 2,53,604కి చేరింది. సింగపూర్‌లో 347 కేసులు బయటపడ్డాయి. బ్రెజిల్‌లో బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరువైంది. రష్యాలో కొత్తగా 6,248 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

Updated Date - 2020-07-15T12:54:32+05:30 IST