త్వరలో కోవిడ్‌-19 ల్యాబ్‌

ABN , First Publish Date - 2020-04-10T05:44:13+05:30 IST

కర్నూలులో త్వరలో కోవిడ్‌-19 టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన

త్వరలో కోవిడ్‌-19 ల్యాబ్‌

కరోనా కట్టడికి జిల్లా యంత్రాగం చర్యలు భేష్‌

ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి


కర్నూలు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కర్నూలులో త్వరలో కోవిడ్‌-19 టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. దీనివల్ల కరోనా టెస్టులన్నీ తిరుపతి, అనంతపురానికి పంపించాల్సిన అవసరం ఉండదన్నారు. రిపోర్టులు త్వరితగతిన వస్తాయన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌లో కోవిడ్‌-19 స్టేట్‌స్పెషల్‌ ఆఫీసర్‌ ముద్దాడ రవిచంద్ర, కలెక్టర్‌ జి.వీరపాండియన్‌, జేసీ రవి పట్టన్‌శెట్టితో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ క్వారంటైన్‌లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.


కోవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్ల వద్ద బయో మెడికల్‌ వేస్ట్‌ను జాగ్రత్తగా డిస్పోజ్‌ చేయించాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈఈ ప్రసాద్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ విజయభాస్కర్‌ను ఆదేశించారు. కోవిడ్‌ ఆసుపత్రులుగా కలెక్టర్‌ డిక్లేర్‌ చేసిన శాంతిరాం, విశ్వభారతి, కర్నూలు సర్వజన వైద్యశాల ఆసుపత్రులలో కరోనా పాజిటివ్‌ బాధితులకు చికిత్స అందిస్తున్నామన్నారు. బాదితులకు చికిత్స అందించే డాక్టర్లకు, నర్సులకు, సిబ్బందికి, క్వారంటైన్‌లో ఉంటున్న మెడికల్‌ సిబ్బందికి అవసరమైన పీపీఈ, ఎన్‌-95 మాస్కులు ఉన్నాయని డీఎంహెచ్‌వో మంత్రికి వివరించారు. 

Updated Date - 2020-04-10T05:44:13+05:30 IST