Abn logo
Sep 27 2020 @ 11:26AM

నవరాత్రులపై కరోనా దెబ్బ... ఉత్సవాలు నిర్వహించకూడదని ప్రభుత్వ నిర్ణయం

Kaakateeya

అహ్మదాబాద్: కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈసారి రాష్ట్రంలో దసరా ఉత్సవాలను నిర్వహించడం లేదని గుజరాత్ సీఎం విజయ్ రూపాణీ ప్రకటించారు. అయితే దసరా సందర్భంగా నిర్వహించే గర్బా నృత్యాలకు అనుమతి ఇస్తారా? లేదా అనేది తెలియాల్సివుంది. దేశవ్యాప్తంగా అక్టోబరు 17 నుంచి 25 వరకూ దసరా నవరాత్రులు జరగనున్నాయి. 

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల జీఎండీసీ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం ప్రతీయేటా దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా గర్బా నృత్యాలు చేసేందుకు యువతీ యువకులు తండోపతండాలుగా వస్తుంటారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగేవి. కాగా ప్రస్తుతం గుజరాత్‌లో 1.3 లక్షలకు మించి కరోనా కేసులు నమోదు కాగా, ఈ వ్యాధి కారణంగా 3,400 మంది మృతి చెందారు. ఈ నేపద్యంలోనే గుజరాత్ ప్రభుత్వం దసరా ఉత్సవాలను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement