బ్రిటన్‌లో లక్ష మార్క్‌ను దాటిన కరోనా మరణాలు!

ABN , First Publish Date - 2021-01-27T00:42:26+05:30 IST

బ్రిటన్‌లో కరోనా మరణాలు మంగళవారం లక్ష మార్క్‌ను దాటాయి.

బ్రిటన్‌లో లక్ష మార్క్‌ను దాటిన కరోనా మరణాలు!

లండన్: బ్రిటన్‌లో కరోనా మరణాలు మంగళవారం లక్ష మార్క్‌ను దాటాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,04,000 మంది కరోనాకు బలైనట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో అమెరికా, బ్రెజిల్, భారత్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన నాల్గో దేశంగా బ్రిటన్ నిలిచింది. కాగా, గతేడాది డిసెంబర్‌లో ఈ దేశంలో ఒక్కసారిగా మరణాలు పెరగడంతో అత్యధిక మరణ రేటును కూడా నమోదు చేసింది. ఇక మృతుల్లో అత్యధికంగా వృద్ధులే ఉన్నట్లు సమాచారం. చనిపోయిన పది మందిలో తొమ్మిది మంది వయసు పైబడిన వారే ఉన్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికులు 65 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బ్రిటన్‌లో బయటపడ్డ కొత్త స్ట్రెయిన్ తర్వాత కొత్త కేసులు గణనీయంగా పెరిగాయి. అందుకే యూకే మూడోసారి లాక్‌డౌన్ విధించింది.      

Updated Date - 2021-01-27T00:42:26+05:30 IST