ఫ్రాన్స్‌లో కరోనా కేసులు తగ్గుముఖం.. గత 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-06-01T06:53:03+05:30 IST

ఫ్రాన్స్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఫ్రాన్స్‌లో కరోనా కేసులు తగ్గుముఖం.. గత 24 గంటల్లో..

పారిస్: ఫ్రాన్స్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 14,322 మంది పేషంట్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని.. ముందురోజుతో పోల్చితే 58 మంది తగ్గినట్టు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరోపక్క ఐసీయూలో చికిత్స పొందే వారి సంఖ్య కూడా 1,361 నుంచి 1,319కి తగ్గినట్టు పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ఆసుపత్రులలో 31 మంది చనిపోయారని.. 11వ రోజు కూడా వందలోపు మరణాలే నమోదైనట్టు వివరించారు. మరోపక్క నర్సింగ్ హోమ్‌లలో చనిపోయిన వారి వివరాలను మంగళవారం చెప్పనున్నామన్నారు. అధికారులు కేవలం ఆసుపత్రుల్లో చనిపోయిన, చికిత్స పొందుతున్న వారి వివరాలనే వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు మొత్తంగా 1,88,882 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 28,802 మంది మరణించారు. 68,355 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం 91,725 మందికి చికిత్స అందిస్తున్నారు. మరోపక్క ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటివరకు 13,84,633 కరోనా పరీక్షలను నిర్వహించింది.  


Updated Date - 2020-06-01T06:53:03+05:30 IST