భారత్‌లో 4000 దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

ABN , First Publish Date - 2020-04-06T15:56:01+05:30 IST

భారత్‌లో 4000 దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

భారత్‌లో 4000 దాటిన కోవిడ్-19 కేసుల సంఖ్య

న్యూఢిల్లీ: ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 భారత్‌లో గంట గంటకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత 12 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 490 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 4067కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా 109 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. ప్రస్తుతం 292 మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగా... మరో 3666 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర కొనసాగుతోంది. అక్కడ మొత్తం 690 మంది కరోనా బారిన పడగా.. తమిళనాడులో 571, ఢిల్లీలో 503 కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-04-06T15:56:01+05:30 IST