బెంగళూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కరోనా రెండోదశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర కొవిడ్ సాంకేతిక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్ ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు బుధవారం ఒక నివేదికను సమర్పించారు. రెండో దశ కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించిన ఆయన.. ఎట్టి పరిస్థితుల్లోనూ నూతన సంవత్సర వేడుకలకు అవకాశం కల్పించవద్దని సూచించారు.