కోవాగ్జిన్‌ను ఆమోదించండి.. కెనడాను కోరిన భారత్ బయోటెక్

ABN , First Publish Date - 2021-08-05T22:00:57+05:30 IST

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియెంట్ కలవరపెడుతోంది. ఈ క్రమంలో అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్ టీకాకు ఆమోదం తెలపాలని కోరుతూ భారత్ బయోటెక్ సంస్థ.. కెనడా

కోవాగ్జిన్‌ను ఆమోదించండి.. కెనడాను కోరిన భారత్ బయోటెక్

న్యూఢిల్లీ: కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా డెల్టా వేరియెంట్ కలవరపెడుతోంది. ఈ క్రమంలో అత్యవసర వినియోగం కోసం కోవాగ్జిన్ టీకాకు ఆమోదం తెలపాలని కోరుతూ భారత్ బయోటెక్ సంస్థ.. కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను కూడా ప్రభుత్వానికి సమర్పించింది. కెనడా ప్రభుత్వం కోవాగ్జిన్ టీకాకు ఓకే చెబితే భారత ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. కోవాగ్జిన్ తీసుకున్న భారత ప్రయాణికులు కెనడా వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. కోవాగ్జిన్‌కు పలు దేశాలు ఆమోదం తెలపలేదు. దీంతో ఈ టీకా తీసుకున్న భారత ప్రయాణికులు ఆయా దేశాలకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 


Updated Date - 2021-08-05T22:00:57+05:30 IST