‘కొవాగ్జిన్‌’ కష్టాలు ఎన్నటికి తీరేనో..?

ABN , First Publish Date - 2021-05-17T05:11:54+05:30 IST

జిల్లాకేంద్రమైన ఒంగోలులో కొవాగ్జిన్‌ టీకాపై ప్రజల్లో ఆందోళన నె లకొంది. మొదటి డోసు వేయించుకున్న తర్వాత ఆరు వారాల్లోపు రెండో డోసు వేయించుకోవాలని అ ధికారులు ప్రకటించినా ఆమేరకు టీకాను వేస్తున్న పరిస్థితి లేదు. నగరంలో సుమారు రెండు లక్షలకు పైగా జనాభా ఉన్నారు.

‘కొవాగ్జిన్‌’ కష్టాలు ఎన్నటికి తీరేనో..?
ఒంగోలు నగరం రామ్‌నగర్‌లోని వ్యాక్సినేషన్‌ కేంద్రం

ఒంగోలులో వ్యాక్సిన్‌ ప్రక్రియపై ఆందోళన

ఆరువారాలు దాటుతున్న టీకాలేని వైనం

ఎక్కడికి వెళ్లినా సమాధానం కరువు

ఇబ్బందిపడుతున్న ప్రజలు


ఒంగోలు(కలెక్టరేట్‌), మే 16 : జిల్లాకేంద్రమైన ఒంగోలులో కొవాగ్జిన్‌ టీకాపై ప్రజల్లో ఆందోళన నె లకొంది. మొదటి డోసు వేయించుకున్న తర్వాత ఆరు వారాల్లోపు రెండో డోసు వేయించుకోవాలని అ ధికారులు ప్రకటించినా ఆమేరకు టీకాను వేస్తున్న పరిస్థితి లేదు. నగరంలో సుమారు రెండు లక్షలకు పైగా జనాభా ఉన్నారు. గడిచిన మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 10వ తేదీ వరకు వేలాది మందికి మొదటి డోసు కొవాగ్జిన్‌ టీకా వేశారు. అయితే గత పక్షం రో జులనుంచి కోవాగ్జిన్‌ టీకా అందుబాటులో లేకపో వడం, వచ్చిన రోజు ఆయా కేంద్రాల వద్దకు వంద లాది మంది ప్రజానీకం రావడంతో టీకా వేయించు కోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వైద్యఆరోగ్యశాఖ ఈనెల 10వతేదీ నుంచి ఈ నెలాఖరు వరకు కేవ లం సెకండ్‌ డోసు వేస్తామని ప్రకటించారు. ఆరు రోజుల క్రితం ఒకసారి సెకండ్‌డోసు వేయగా ఆది వారం మరోసారి ఎంపికచేసిన కేంద్రాల్లో రెండో డో సు ప్రక్రియను ప్రారంభించారు.

గడువు దాటిన వారు వేలాది మంది..

వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించిన ప్రకారం మొదటి డోసు వేయించుకున్న ఆరువా రాలకు రెండో డోసు వేయిం చుకోవాలని చెప్తున్నా వాస్తవ రూపంలో అది అమలుకావ డం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే మొ దటి డోసువేయించుకున్న వా రు 50 రోజులు దాటిపోవడం తో వారందరూ ఆందోళన చెం దుతున్నారు. అయితే వ్యాక్సినే షన్‌ కోసం సమీపంలోని పీ హెచ్‌సీలు, సచివాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సమాచారం చెప్పేవారేరి..

సెకండ్‌డోసు వ్యాక్సినేషన్‌ కోసం వెళ్ళే ప్రజలకు కనీస సమాచారం చెప్పే వారు లేక ప్రజలు ఆందో ళన చెందుతున్నారు. ఆయా పీహెచ్‌సీల వద్దకు వె ళితే సచివాలయాల్లో ఇస్తారని చెప్తుండగా, సచివా లయాల వద్దకు వెళ్ళితే తమకు రాలేదని దురుసు గా సమాధానాలు వస్తున్నాయి. దీంతో ప్రజానీకం ఏమిచేయాలో అర్థం కానీ పరిస్థితి ఏర్పడింది. ఒం గోలులో నాలుగు అర్బన్‌హెల్త్‌ సెంటర్లు ఉండగా, వాటి పరిధిలో 71 సచివాయాలు ఉన్నాయి.  ఒక్కొ క్క హెల్త్‌ సెంటర్‌ పరిధిలో 50వేల మంది జనాభా ఉండగా ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఐదారు వే లమంది జనాభా ఉన్నారు. అయితే ఆదివారం రెండో డోసు వేయించుకునేందుకు పట్టుమని పది మందికి కూడా టోకేన్లు ఇవ్వలేదు. 

హడావుడిగా పరుగులు

సాధారణంగా వ్యాక్సినేషన్‌ వేసే వ్యక్తికి ముందు రోజు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వడంతో పాటు టో కేన్‌ ఇవ్వాలి. కానీ అందుకు భిన్నంగా ఆయా ప్రా ంతాల్లో వ్యవహరిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసే రోజు కొ ంతమందికి ఫోన్‌ చేసి మీకు ఫలానా చోట వ్యాక్సిన్‌ వేస్తున్నారని, అక్కడికి వెళ్లాలని చెప్పి కట్‌ చేస్తు న్నారు. ఫోన్‌ రిసీవ్‌ చేసుకున్న వ్యక్తి ఎక్కడ ఉన్నా హడాహుడిగా టీకా కోసం పరుగులు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతా ధికారులు వ్యాక్సినేషన్‌ కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-05-17T05:11:54+05:30 IST