కోవ్యాక్సిన్‌ ప్రభావశీలత 60%

ABN , First Publish Date - 2020-10-24T08:50:07+05:30 IST

కరోనా రోగులపై ‘కోవ్యాక్సిన్‌’ ప్రభావశీలత అత్యధికంగా 60శాతం మేర ఉండొచ్చని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అంచనా వేసింది...

కోవ్యాక్సిన్‌ ప్రభావశీలత 60%

  • డబ్ల్యూహెచ్‌వో నిర్దేశిత ప్రమాణాల కంటే మెరుగు 


న్యూఢిల్లీ, అక్టోబరు 23 : కరోనా రోగులపై ‘కోవ్యాక్సిన్‌’ ప్రభావశీలత అత్యధికంగా 60శాతం మేర ఉండొచ్చని హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అంచనా వేసింది. కనీసం 50శాతం ప్రభావశీలతను చూపే యాంటీ వైరల్‌ వ్యాక్సిన్లకు ఆమోదం తెలుపవచ్చనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల కంటే అత్యధిక స్థాయిలో కోవ్యాక్సిన్‌ పనిచేస్తుందని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. మూడోదశ ప్రయోగ పరీక్షలు నవంబరు రెండోవారంలో ప్రారంభమవుతాయని, వీటికోసం వచ్చే ఆరు నెలల్లో రూ.150 కోట్లు వెచ్చిస్తామని వెల్లడించారు. వాటి మధ్యంతర ఫలితాలు వచ్చే ఏడాది(2021) ఏప్రిల్‌ లేదా మేలో విడుదల అవుతాయన్నా రు. ఏడాదికి 15 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి చేసే సామ ర్థ్యం కంపెనీకి ఉందని సాయిప్రసాద్‌ తెలిపారు. కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వివిధ కంపెనీల కోసం ప్రతి 3 నెలలకు ఒక కొత్త కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ డోసులను విడుదల చేయబోతోంది. వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి, పంపిణీలపై దృష్టిసారించేందుకు రూ.3వేల కోట్ల మూలధన వ్యయంతో ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌ లైఫ్‌ సైన్సెస్‌’(ఎస్‌ఐఎల్‌ఎస్‌) అనే కంపెనీని ఏర్పాటుచేసినట్లు సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. 2021 చివరిలోగా ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా, నోవోవ్యాక్స్‌ సహా ఐదు కంపెనీల వ్యాక్సిన్ల 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. 


Updated Date - 2020-10-24T08:50:07+05:30 IST