కొవ్యాక్సిన్‌తో డెల్టా, డెల్టా ప్లస్‌కు చెక్.. ఐసీఎమ్ఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి

ABN , First Publish Date - 2021-08-02T22:43:51+05:30 IST

ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లకు దేశీ కరోనా టీకా కొవ్యాక్సిన్ చెక్ పెట్టగలదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) తాజాగా జరిపిన అధ్యయనంలో తేలింది.

కొవ్యాక్సిన్‌తో డెల్టా, డెల్టా ప్లస్‌కు చెక్.. ఐసీఎమ్ఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లకు దేశీ కరోనా టీకా కొవ్యాక్సిన్ చెక్ పెట్టగలదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) తాజాగా జరిపిన అధ్యయనంలో తేలింది. ఐసీఎమ్ఆర్‌లోని అంటువ్యాధుల అధ్యయన శాఖ అధిపతి డా. సమీరన్ పండా ఈ మేరకు ఓ కీలక ప్రకటన చేశారు. యాంటీబాడీ టైటర్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ డెల్టా, డెల్టా ప్లస్, బీ.1.617.3 వేరియంట్లను కొవ్యాక్సిన్ నిరోధించగలదని పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ కారణంగా కొన్ని సందర్భాల్లో టీకా తీసుకున్న వారు కూడా కరోనా బారినపడుతున్న(బ్రేక్‌త్రూ ఇన్ఫెక్షన్లు) విషయం తెలిసిందే. 

Updated Date - 2021-08-02T22:43:51+05:30 IST