నేడు కొవాగ్జిన్‌ రెండో డోస్‌

ABN , First Publish Date - 2021-06-23T05:22:59+05:30 IST

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో 10 కేంద్రాల్లో 45 ఏళ్లు దాటిన వారికి బుధవారం కొవాగ్జిన్‌ రెండో డోస్‌ వేస్తున్నట్టు కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

నేడు కొవాగ్జిన్‌ రెండో డోస్‌

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 22: రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలో 10 కేంద్రాల్లో 45 ఏళ్లు దాటిన వారికి బుధవారం కొవాగ్జిన్‌ రెండో డోస్‌ వేస్తున్నట్టు కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీఎంహెచ్‌ఎస్‌ స్కూల్‌, ఆనంద్‌నగర్‌ జమున స్కూల్‌, సిటీ స్పెషల్‌ స్కూల్‌ మోరంపూడి, ఆనంద్‌ రీజెన్సీ ఎదు రుగా ఉన్న చున్నీలాల్‌ జాజు హైస్కూల్‌, నారాయణపురం ప్రాథమిక పాఠ శాల, క్వారీపేట నగర పాలక సంస్థ హైస్కూల్‌, మంగళవారపుపేట ట్రైనింగ్‌ కాలేజ్‌, 39వ డివిజన్‌ అంబేడ్కర్‌ కమ్యూనిటీ హాల్‌, ఆల్‌కట్‌ గార్డెన్స్‌ ఆర్‌సీఎం హైస్కూళ్లలో కొవాగ్జిన్‌ రెండో డోస్‌ వేస్తారని కమిషనర్‌ చెప్పారు. ఉదయం 8గంటల నుంచి ప్రారంభమవుతుందని అర్హులైన వారు కూపన్లు లేకపో యినా ఆయా సెంటర్లకు వెళ్లి టీకాలు వేయించుకోవాలని చెప్పారు.

Updated Date - 2021-06-23T05:22:59+05:30 IST