Abn logo
Sep 21 2021 @ 08:31AM

కోర్టు ప్రాంగణంలోకి వర్షపు నీరు

                    - కాగితపు పడవలు వదిలి న్యాయవాదుల నిరసన


పెరంబూర్‌(చెన్నై): తిరుపత్తూర్‌ జిల్లా వాణియంబాడీ కోర్టు ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీటిని తొలగించాలని కోరుతూ న్యాయవాదులు నీటిలో కాగితపు పడవలు వదిలి నిరసన తెలిపారు. వాణియం బాడీ కచ్చేరి రోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ ఎస్టేట్‌ ప్రాంగణంలో పలు కోర్టుల భవనాలు, తహసీల్దార్‌ కార్యాలయం, వాణిజ్యపన్ను శాఖ కార్యాలయం తదితరాలున్నాయి. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో కార్యాలయాలకు వెళ్లే ప్రవేశద్వారం, కోర్టుల పరిసర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. దీంతో, కార్యాలయాలకు వచ్చే ప్రజలు, కోర్టులకు వెళ్లే న్యాయ వాదులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నీటిని తొలగించాలని ప్రజాపనులశాఖ, వాణియంబాడీ మున్సిపల్‌ అధికారులకు తెలిపినా ఫలితం లేదు. సోమవారం ఉదయం కోర్టుకు వచ్చిన న్యాయవాదులు, ప్రాంగణంలోని నీటిలో కాగితపు పడవలు వదిలి నిరసన తెలిపారు. అలాగే కోర్టు భవన సముదాయం నిర్మించాలని కోరుతూ వారం రోజులు విధులు బహిష్కరించనున్నట్లు ప్రకటించారు.