Apr 13 2021 @ 14:32PM

కరోనాతో ప్రముఖ నటుడు కన్నుమూత

కోవిడ్‌ ప్రభావం సెకండ్‌ వేవ్‌లో మరింత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఈ సెకండ్‌ వేవ్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు కోవిడ్‌ బారిన పడుతున్నారు. ఈ కోవిడ్‌ కారణంగా జాతీయ అవార్డ్‌ విన్నింగ్ మూవీ 'కోర్టు'లో నటించిన విరా సతీదార్‌(60) కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సను పొందుతున్నాడు. ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో విరా సతీదార్‌ కన్నుమూసినట్లు 'కోర్టు' మూవీ దర్శకుడు చైతన్య తమ్హానే తెలియజేస్తూ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీస్‌లోని పలువురు సతీదార్‌ మరణంపై తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.మహారాష్ట్రలో జరిగిన అంబేద్కర్‌ ఉద్యమంలో వీరా సతీదార్ కీలకమైన పాత్రను పోషించారు.