న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగింది

ABN , First Publish Date - 2021-01-27T05:32:05+05:30 IST

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలను ఆపాలని శతవిధాలుగా ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ చివరికి రాజ్యాంగమే గెలిచిందని

న్యాయవ్యవస్థపై నమ్మకం పెరిగింది
అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న టీడీపీ నాయకులు

 అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ పాలాభిషేకం 


నెల్లూరు(వ్యవసాయం), జనవరి 26 : అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలను ఆపాలని శతవిధాలుగా ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ చివరికి రాజ్యాంగమే గెలిచిందని, మనదేశంలో న్యాయ వ్యవస్థపైన నమ్మకం పెరిగిందని తెలుగుదేశంపార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ  అజీజ్‌, నెల్లూరు సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు వీఆర్సీ సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అజీజ్‌ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, ఆరోగ్య సంక్షోభంతోపాటు ఎన్నో రకాల సంక్షోభాలను చూశామని రాజ్యాంగ సంక్షోభం చూడడం ఇదే మొదటిసారన్నారు. కోటంరెడ్డి మాట్లాడుతూ డీజీపీని నాలుగుసార్లు కోర్టుకు రమ్మన్నారంటే పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిందో గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య, నాయకులు పొత్తూరు శైలజ, సాబీర్‌ఖాన్‌, జలదంకి సుధాకర్‌, కప్పిర శ్రీనివాసులు, మామిడాల మధు, సత్యనాగేశ్వరరావు, జహీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T05:32:05+05:30 IST