హనీ బాబుకు 21 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

ABN , First Publish Date - 2020-08-08T07:48:09+05:30 IST

కోరేగావ్‌-భీమా కేసులో అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హనీ బాబును ఈనెల 21వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపుతూ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై ఎన్‌ఐఏ...

హనీ బాబుకు 21 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

ముంబై, ఆగస్టు 7: కోరేగావ్‌-భీమా కేసులో అరెస్టయిన ఢిల్లీ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ హనీ బాబును ఈనెల 21వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపుతూ ప్రత్యేక కోర్టు ఆదేశాలిచ్చింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అభియోగాలపై ఎన్‌ఐఏ అధికారులు జూలై 28న ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఏ రిమాండ్‌ గడువు శుక్రవారంతో ముగియడంతో ఆయన్ని జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు జడ్జి డీఈ కొఠాలికర్‌ ఆదేశాలిచ్చారు.

Updated Date - 2020-08-08T07:48:09+05:30 IST