చార్జింగ్ వైరుతో భార్యను చంపిన భర్త.. 8 ఏళ్ల తర్వాత తీర్పు..

ABN , First Publish Date - 2020-07-07T18:23:33+05:30 IST

భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ కొత్తగూడెం కోర్టు ఐదో జిల్లా జడ్జ్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ సోమవారం తీర్పు వెల్లడించారు

చార్జింగ్ వైరుతో భార్యను చంపిన భర్త.. 8 ఏళ్ల తర్వాత తీర్పు..

భార్యను చంపిన కేసులో భర్తకు జీవితఖైదు 


భద్రాచలం (ఆంధ్రజ్యోతి): భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవితఖైదు విధిస్తూ కొత్తగూడెం కోర్టు ఐదో జిల్లా జడ్జ్‌ మహ్మద్‌ అబ్దుల్‌ రఫీ సోమవారం తీర్పు వెల్లడించారు. 2012 అక్టోబరు 9న రాత్రి సమయంలో అంకి కనకరాజు అనే వ్యకి రూ.లక్ష అదనపు కట్నం తేవాలని తన భార్య నిర్మలపై ఒత్తిడి తెచ్చాడు. ఈ క్రమంలో ఆమెను కనకరాజు చార్జింగ్‌ వైరుతో గొంతు నులుమి చంపాడు. నిర్మల అన్న జి. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం అప్పటి ఎస్‌ఐ జితేందర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడు కనకరాజును అరెస్టు చేసి అప్పటి ఏఎ్‌సపీ గజరావుభూపాల్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ సమర్పించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరపున అడిషనల్‌ పీపీ వి.పురుషోత్తం 17మంది సాక్ష్యులను ప్రవేశపెట్టగా కోర్టు కానిస్టేబుల్‌ విజయ్‌చంద్‌ సహకరించారు. సాక్ష్యులను విచారించిన న్యాయమూర్తి హమ్మద్‌ అబ్దుల్‌ రఫీ సోమవారం తీర్పును వెల్లడించారు. నిందితుడైన కనకరాజుకు జీవిత ఖైదు, రూ.21 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. 

Updated Date - 2020-07-07T18:23:33+05:30 IST