కోర్టు ఉద్యోగిని కిడ్నాప్‌

ABN , First Publish Date - 2020-07-09T10:26:38+05:30 IST

ఆలయానికి దర్శనానికి వచ్చిన ఓ కోర్టు ఉద్యోగినితోపాటు ఆమె కుమారుడిని కొందరు కిడ్నాప్‌..

కోర్టు ఉద్యోగిని కిడ్నాప్‌

ఆమెతోపాటు కొడుకును కూడా.. 

చేవెళ్ల వద్ద వదిలిన కిడ్నాపర్లు


నార్సింగ్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఆలయానికి దర్శనానికి వచ్చిన ఓ కోర్టు ఉద్యోగినితోపాటు ఆమె కుమారుడిని కొందరు కిడ్నాప్‌ చేసి, పోలీసుల భయంతో వదిలి వెళ్లారు. బండ్లగూడ జాగీర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గంధంగూడ ప్రాంతానికి చెందిన ఆదిలక్ష్మి (37)నాంపల్లి కోర్టులో పనిచేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా రోజూ ఇంటి వద్ద ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయానికి పూజకు వెళుతోంది. బుధవారం ఆమె తన ఇద్దరు కొడుకులతో కలిసి దేవాలయానికి వెళ్లింది. ఆ సమయంలో కొందరు కారులో వచ్చి ఆదిలక్ష్మితోపాటు ఒక కొడుకును తీసుకెళ్లారు. ఎంతసేపటికీ రాకపోవడంతో ఆమె కొడుకు, బంధువులు దేవాలయ పరిసరాల్లో వెతికారు. గమనించిన గుడి పూజారి కారులో వచ్చిన కొందరు ఆమెను తీసుకెళ్లారని చెప్పాడు. కాగా, ఆదిలక్ష్మిని, ఆమె కొడుకును కిడ్నాప్‌ చేసిన నలుగురు కారులో చేవెళ్ల వైపు వెళ్తుండగా, ఆ మార్గంలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు వారిని చేవెళ్ల వద్ద కారులోంచి దింపి పారిపోయారు. నార్సింగ్‌ పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-07-09T10:26:38+05:30 IST