కోర్టుకు చెప్పకుండా జైలుకా?

ABN , First Publish Date - 2021-05-14T08:38:36+05:30 IST

‘నిందితుడు ధూళిపాళ్ల నరేంద్రను ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారు. దానిని పట్టించుకోలేదు. కనీసం ఆయన్ను జైలుకు తరలించే విషయాన్నీ కోర్టుకు చెప్పలేదు. ఎందుకిలా చేశారు..’ అని వి

కోర్టుకు చెప్పకుండా జైలుకా?

ధూళిపాళ్లను ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారు

దానినీ పట్టించుకోలేదు

ఏసీబీ అధికారులపై కోర్టు ఫైర్‌

ఆయనకు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించండి

న్యాయమూర్తి ఆదేశం


విజయవాడ, మే 13 (ఆంధ్రజ్యోతి): ‘నిందితుడు ధూళిపాళ్ల నరేంద్రను ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యులు చెప్పారు. దానిని పట్టించుకోలేదు. కనీసం ఆయన్ను జైలుకు తరలించే విషయాన్నీ కోర్టుకు చెప్పలేదు. ఎందుకిలా చేశారు..’ అని విజయవాడలోని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి ఏసీబీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనాతో ఆయుష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరేంద్రకు నెగటివ్‌ రావడంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. ఆయనకు జైలులో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందజేయాలని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో గురువారం మరో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిగింది. నరేంద్రను ఐసొలేషన్‌లో ఉంచాలని వైద్యులు చేసిన సూచనలు ఎందుకు పట్టించుకోలేదని న్యాయమూర్తి ఈ సందర్భంగా ఏసీబీ అధికారులను ప్రశ్నించారు. వైద్యులు డిశ్చార్జి చేయడంతో జైలుకు తరలించామని ఏసీబీ తరపున న్యాయవాది బదులిచ్చారు. వైద్యులు డిశ్చార్జి చేస్తే జైలుకు తరలించేటప్పుడు ఆ విషయాన్ని కోర్టుకు తెలియజేయాల్సిన అవసరం లేదా అని న్యాయమూర్తి నిలదీశారు. నరేంద్రకు రాజమండ్రిలో గానీ, విజయవాడలో గానీ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు.

Updated Date - 2021-05-14T08:38:36+05:30 IST