Advertisement
Advertisement
Abn logo
Advertisement

న్యాయ సేవా సంస్థతో మనోధైర్యం


జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజేష్‌

గిద్దలూరు టౌన్‌, అక్టోబరు 26 : ఫిర్యాదు దారుల సమస్యలను పరిష్కరించి, మనోధైర్యం నింపడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.రాజేష్‌ అన్నారు. మంగళవారం గిద్దలూరులోని కోర్టు చాంబర్‌లో పట్టణానికి చెందిన సూర్య విద్యా నికేతన్‌ విద్యార్థులతో ఆయన మాట్లాడారు.  చిన్నవయస్సులోనే చట్టాల గురించి తెలుసుకుంటే జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. సమస్యలున్నా వారిని మండల న్యాయ సేవాధికార సంస్థకు తీసుకుని వస్తే న్యాయసహాయం చేస్తామని జడ్జి రాజేష్‌ పేర్కొన్నారు. అనంతరం మండలంలోని ఉప్పలపాడు, నరవ, అక్కలరెడ్డిపల్లె, చంద్రారెడ్డిపల్లె గ్రామాలలో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా  జడ్జి రాజేష్‌, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సరిత మాట్లాడుతూ అర్హత ఉండి ఎవరైనా రేషన్‌కార్డుతోపాటు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు రాజేశేఖర్‌రెడ్డి, యాసిన్‌బాషా, శేషశైనారెడ్డి, పిచ్చయ్య, సిద్ద య్య, ఓబులరెడ్డి, పారాలీగల్‌ వలంటీర్‌ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.


Advertisement
Advertisement