కరోనా బాధితుల్లో ధైర్యం నింపాలి

ABN , First Publish Date - 2021-04-23T05:19:59+05:30 IST

కరోనా బాధితులతో స్వయంగా మాట్లాడి వారిలో ధైర్యం నింపాలని కలెక్టర్‌ నివాస్‌.. గ్రామ వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సూచించారు. అరసవల్లి, ఎల్‌బీఎస్‌ కాలనీ, దండివీధిలోని కంటైన్మెంట్‌ జోన్లలో గురు వారం కలెక్టర్‌ పర్యటించారు. కరోనా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మందులు సక్రమంగా వాడాలని, తద్వారా త్వరగా కోలుకుంటారని చెప్పారు. అనంతరం ఆయా సచివాలయాల్లో వలంటీర్లతో సమీక్షించారు. ఫీవర్‌ సర్వే వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి పాజిటివ్‌ కేసును కూడా గుర్తించాలన్నా రు.

కరోనా బాధితుల్లో ధైర్యం నింపాలి
అరసవల్లిలో సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌

 ప్రతి పాజిటివ్‌ కేసునూ గుర్తించాలి

 వ్యాక్సిన్‌కు కొరత లేదు

 కలెక్టర్‌ నివాస్‌ 

గుజరాతీపేట, ఏప్రిల్‌ 22: కరోనా బాధితులతో స్వయంగా మాట్లాడి వారిలో ధైర్యం నింపాలని కలెక్టర్‌ నివాస్‌.. గ్రామ వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి సూచించారు. అరసవల్లి, ఎల్‌బీఎస్‌ కాలనీ, దండివీధిలోని కంటైన్మెంట్‌ జోన్లలో గురు వారం కలెక్టర్‌ పర్యటించారు. కరోనా బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మందులు సక్రమంగా వాడాలని, తద్వారా త్వరగా కోలుకుంటారని చెప్పారు. అనంతరం  ఆయా సచివాలయాల్లో వలంటీర్లతో సమీక్షించారు. ఫీవర్‌ సర్వే వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి పాజిటివ్‌ కేసును కూడా గుర్తించాలన్నా రు. ‘ఫీవర్‌ సర్వేను పక్కాగా  నిర్వహించాలి. జ్వరం, దగ్గు మా త్రమే కాకుండా నీరసం, విరేచనాలు, కీళ్లనొప్పులు, తదితర లక్షణాలు కూడా కరోనాకు కారణమని గుర్తించాలి.  శ్రీకాకుళం నగర పరిధిలో 30 శాతం మేర పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.  రానున్న రెండు వారాలు చాలా కీలకం. ఒక్కరూ కూడా మరణించ కూడదు. ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి,  పరీక్షలు చేయాలి. జిల్లాలో వ్యాక్సిన్‌ కొరతలేదు. కొవాగ్జిన్‌ వేయించుకు న్న వారు 4 వారాల తర్వాత, కొవిషీల్డు వేయించుకున్న వారు 6వారాల తర్వాత రెండో డోస్‌ను పొందాలి. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి 0.03 శాతం మాత్రమే పాజిటివ్‌ రావడానికి అవకాశం ఉంది.  మాస్కు ఽధరించడం, భౌతిక దూరం పాటించడం, చే తులు తరచూ శుభ్రపర్చుకోవడం చేయాలి.’ అని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ కె .శివప్రసాద్‌, డీఎస్సీ మహేంద్ర, తహసీల్దార్‌ వైవీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 


హైరిస్క్‌ జోన్‌లో శ్రీకాకుళం 

- జిల్లాకేంద్రంలో సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు

మార్నింగ్‌, మేట్నీ షోలకు మాత్రమే అనుమతి

కలెక్టర్‌ నివాస్‌

గుజరాతీపేట : ‘శ్రీకాకుళం.. హైరిస్క్‌ జోన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచాలి. మార్నింగ్‌ షో, మేట్నీ షోలకు మాత్రమే థియేటర్లు పరిమితం చేయాలి’ అని కలెక్టర్‌ నివాస్‌ ఆదేశించారు. గురువారం జడ్పీ సమావేశమందిరంలో వర్తకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ, శ్రీకాకుళం నగరంలో ప్రతిరోజూ  30శాతం కరోనా కేసులు నమోదవుతున్నాయన్నారు. ‘బుధవా రం జిల్లాలో 1,444 కేసులు నమోదవగా ఇందులో 400 శ్రీకా కుళం నగరం నుంచే వచ్చాయి. సినిమా హాళ్లను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలి. మార్నింగ్‌, మేట్నీలు షోలు మాత్రమే ప్రదర్శించాలి.  పాతబస్టాండ్‌లోని పొట్టిశ్రీ రాములు మార్కెట్‌ను 80 అడుగుల రహదారికి మార్పు చేశాం. ఆదివారం పూర్తిగా మార్కెట్‌ను మూసివేసేందుకు వర్తకులు సహకరించాలి. నగరం అవతల అనధికారికంగా వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కొన్ని దుకాణాల్లో వెనుకవైపు నుంచి వ్యాపారాలు చేస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవు’ అని కలెక్టర్‌ హెచ్చరించారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ మాట్లాడుతూ, కరోనా కట్టడిలో యువత ముందుండాలన్నారు. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సినిమా హాళ్లను మార్నింగ్‌, మేట్నీ షోలకు పరిమితం చేస్తున్నట్టు థియేటర్ల యజమానులు తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కె.శివప్రసాద్‌, డీఎస్పీ మహేంద్ర పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T05:19:59+05:30 IST